Begin typing your search above and press return to search.

మరోసారి చింతకాయల అయ్యన్నపాత్రుడు బూతు పురాణం!

By:  Tupaki Desk   |   16 Jun 2022 9:30 AM
మరోసారి చింతకాయల అయ్యన్నపాత్రుడు బూతు పురాణం!
X
టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి తన నోటికి పనిచెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి బూతు పరాణం లంకించుకోవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరంలో టీడీపీ నిర్వహించిన మినీ మహానాడులో పోలీసులు, సీఎం జగన్, ప్రభుత్వంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. టీడీపీ మహిళా నేతలు వేదికపై ఉన్నప్పుడే.. సభలో మహిళలు ఉన్నప్పుడే రాయలేని భాషలో పోలీసులపై రెచ్చిపోయారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు నావే అని అంటున్నావ్ కదా జగన్.. ఏం పీకావని 175 వస్తాయని మండిపడ్డారు.

ఎన్నికల ముందు మోదీ మెడలు వంచుతానని జగన్ ప్రగల్భాలు పలికారని.. ఇప్పటి వరకూ 15 సార్లు కలిసిన వైఎస్‌ జగన్‌ లోపల ఏం పిసికారంటూ నిప్పులు చెరిగారు.

చెత్తమీద కూడా పన్నేసిన చెత్త నాకొడుకులు అని తాను మాట్లాడితే తనపై మొత్తం 11 కేసులు పెట్టారనీ.. ఇందులో ఒక రేప్‌ కేస్‌ కూడా ఉందన్నారు. ఈ వయసులో తాను రేప్‌ చెయ్యగలనా అనే విషయం కూడా ఈ పోలీసులకు తెలియకపోవడం విడ్డూరమని అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు.

టీడీపీలో ఉన్నవాళ్లు మగాళ్లు కాదని మంత్రి రోజా అన్నారనీ.. ఆమెకు ఈ విషయం ఎలా తెలుసో చెప్పాలన్నారు. తాను మగాడిని కాదని అంటున్న రోజా.. ఒకసారి టెస్ట్‌ చేసి చూస్తే తెలుస్తుందని అయ్యన్న అసభ్య వ్యాఖ్యలు చేశారు. తననైనా సరే.. లోకేష్‌నైనా సరే టెస్ట్‌ చేస్తావా అని మంత్రి రోజాను ప్రశ్నించారు.

పోలీసులకు తెలిసే గంజాయి వ్యాపారం జరుగుతోందన్నారు. డబ్బులు తీసుకొని గంజాయి తరలించేవారిని వదిలేస్తున్నారని అయ్యన్న తీవ్ర ఆరోపణలు చేశారు. నా దగ్గర మీ తందనాలా.. సిగ్గులేదా నా కొడకల్లారా..? 5 లారీలు గంజాయి వెళ్తే ఒక లారీ పట్టుకొని నాలుగు లారీలు వదిలేసి డబ్బులు దొబ్బుతుంటారు. మీ పెళ్లాలమీద ఒట్టెయ్యండి..? అంటూ పోలీసులపైన నిప్పులు చెరిగారు. ఐపీఎస్.. ఐపీఎస్.. బోడి ఐపీఎస్‌.. త్రీస్టార్ల పరువు తీసేస్తున్నారు కదరా అంటూ పోలీసులపైన మండిపడ్డారు.