Begin typing your search above and press return to search.

అయ్యన్న మాట బాబు కానీ వింటే..

By:  Tupaki Desk   |   13 Jan 2017 2:50 PM IST
అయ్యన్న మాట బాబు కానీ వింటే..
X
కొన్ని విషయాల గురించి ప్రముఖులు తొందరపడి మాట్లాడరు. తమ నోటి నుంచి వచ్చే ఒక్కమాటతోలెక్కలు మొత్తంగా మారిపోవటమే కాదు.. లేనిపోని తలనొప్పులు వస్తాయన్న విషయం వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి. ఎలాంటి మూడ్ లో ఉన్నారో కానీ..ఏపీ మంత్రివర్యుల మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోపం తెప్పించేలా ఉందన్న మాట వినిపిస్తోంది.

ఏయూ ప్లాటినం జూబ్లీ ఆడిటోరియంలోజరిగిన ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా డైరీని మంత్రి అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ప్రజా జీవితంలో ఉన్న వారు ప్రెస్ ను దగ్గరకు రానివ్వకుండా చూడటం సాధ్యం కాదనివ్యాఖ్యానించారు. ఇదంతా రోటీన్ గా చెప్పే మాటలు. కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలిప్పుడు ఏపీ అధికారపక్షంలో హాట్ టాపిక్ గా మారాయి.

తాను నిద్ర లేవగానే పేపర్లు చదువుతానని.. ముఖ్యంగా సాక్షిపత్రికను తాను చదువుతానని చెప్పి . తమ పార్టీ వాళ్లు ఈనాడు.. జ్యోతి చదవమని చెబుతారని.. కానీ తాను మాత్రం సాక్షిని చదువుతానని చెప్పారు. ‘‘మా వాళ్లు సాక్షిని చదవొద్దంటారు. ఈనాడు.. జ్యోతి రెండు మాకు ఎప్పుడూ అనుకూలంగానే రాస్తాయి. నేనైతేమా లోపాలు ఎత్తి చూపే సాక్షిపత్రికనే ముందుగాచదవాలనుకుంటాను’’ అని చెప్పేశారు.

సాక్షి కథనాల్లో నిజాలు ఉండొచ్చు.. లేకపోవచ్చని కానీ తప్పులు ఉంటే మాత్రం సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్న మాట చూస్తే.. ఏపీ సర్కారుకు ఈనాడు.. జ్యోతిలు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని ఆన్ రికార్డెడ్ గా చెప్పినట్లు లేదు. మరీ.. వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/