Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు : అసదుద్దీన్‌ పై కేసు నమోదు !

By:  Tupaki Desk   |   12 Nov 2019 5:10 AM GMT
అయోధ్య తీర్పు : అసదుద్దీన్‌ పై కేసు నమోదు !
X
అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు శనివారం తుది తీర్పు వెల్లడించిన విషయం అందరికి తెలిసిందే. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు చెప్పింది. అలాగే దీని కి ప్రత్యామ్నాయం గా మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డు కు అయోధ్య లోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలని, దీని కి కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపింది. ఈ తీర్పు ని అందరూ స్వాగతించారు. సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్లు కూడా కొంచెం అసంతృప్తి తోనే సుప్రీం కోర్టు పై ఉండే గౌరవం తో తీర్పుని స్వాగతించారు.

ఈ అయోధ్య వివాదం పై తుది తీర్పు నేపథ్యం లో ... కేంద్రం దేశం లో ఉన్న ప్రతి ఒక్కరికి ..కొన్ని నియమాలు పాటించాలని ఆదేశాలు జారీచేసింది. సోషల్ మీడియా లో కానీ , మరెక్కడైనా కానీ ఈ తీర్పు పై వివాదస్పదమైన వ్యాఖ్యలు చేస్తే కఠిన శిక్షలు తప్పవు అంటూ ముందే అందరిని హెచ్చరించింది. అయినప్పటి కీ సుమారుగా 70 మందికి పైగా ఈ నియమాలని అతిక్రమించి ..అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ అయోధ్య తీర్పు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది.

నవంబర్ 9న అయోధ్య వివాదం పై సర్వోన్నత న్యాయ స్థానం చరిత్రాత్మక తీర్పు వెల్లడించిన తరువాత .. అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పు సంతృప్తి కలిగించ లేదని.. ముస్లిం వర్గానికి అన్యాయం జరిగిందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు పట్ల అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యల పై మధ్య ప్రదేశ్‌కు చెందిన న్యాయ వాది పవన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జహంగీర్ బాద్ పోలీసు స్టేషన్‌ లో ఒవైసీ పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అసదుద్దీన్‌ పై కేసు నమోదు చేశారు. నాడు బాబ్రీ మసీదును కూల్చి ఉండక పోతే.. ఇవాళ ఎలాంటి తీర్పు వచ్చి ఉండేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ను గౌరవిస్తాం.. అయితే అదే సర్వోన్నతమైనది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. మసీదు నిర్మాణాని కి 5 ఎకరాల స్థలం తమకు దానంగా అక్కర్లేదని అసదుద్దీన్ పేర్కొన్నారు. మాపై సానుభూతి, అభిమానం చూపాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు.