Begin typing your search above and press return to search.

అవంతి అడ్డంగా బుక్కయ్యారుగా!

By:  Tupaki Desk   |   26 Jan 2020 9:37 AM GMT
అవంతి అడ్డంగా బుక్కయ్యారుగా!
X
ఏపీకి సరికొత్తగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా కొత్త రూపును సంతరించుకునేందుకు సిద్ధమైన సాగర నగరం విశాఖపట్నంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్టర కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న స్థానిక వైసీపీ నేత, భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) జాతీయ జెండాను అవమానపరచారు. గణతంత్రి దినోత్సవం సందర్భంగా తమ పార్టీ నగర శాఖ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో భాగంగా అవంతి.. జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు.

ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఓ మంత్రిగా ఉండి కూడా జాతీయ జెండాను అవమానపరుస్తూ జెండాను తలకిందులుగా ఎలా ఎగురవేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. ఓ రాజకీయ వేత్తగా, మంత్రిగా మారే కంటే ముందు... అవంతి ఓ విద్యా సంస్థల అధినేతగా అందరికీ చిరపరచితులే.. ఇంటిపేరు ముత్తంశెట్టి అయినా... తాను నెలకొల్పిన విద్యా సంస్థల పేరు అవంతి పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న అవంతికి... జాతీయ జెండా ఎలా ఉంటుందో తెలియదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

అసలే... ఇప్పుడు ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఓ రేంజిలో నడుస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో అది కూడా ఏపీకి నూతన రాజధానిగా కొత్త రూపు సంతరించుకుంటున్న విశాఖలో మంత్రి ఇలా జాతీయ జెండాను అవమానపరచేలా తలకిందులుగా ఎగురవేసిన వైనం పెను దుమారాన్నే రేపేలానే ఉందని చెప్పక తప్పదు. అయితే జెండా కర్రకు జాతీయ జెండాను అమర్చిన వ్యక్తులు చేసిన తప్పునకు అవంతి ఎలా బాధ్యుడవుతారని కొందరు సర్ది చెబుతున్నా... తాను హాజరవుతున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు... ప్రత్యేకించి జెండాకు సంబంధించి కొంచెమైనా జాగ్రత్త వహించాలి కదా అన్న వాదనలూ వినిపిస్తున్నాయి.