Begin typing your search above and press return to search.

ప్రజా ప్రతినిధులు ఫెయిల్...వైసీపీ మాజీ మంత్రి ...?

By:  Tupaki Desk   |   13 Aug 2022 3:25 PM GMT
ప్రజా ప్రతినిధులు ఫెయిల్...వైసీపీ మాజీ మంత్రి ...?
X
ఎక్కడైనా ప్రభుత్వం ఫెయిల్ అయిందనో లేక తప్పులు చేసిందనో అంటే అది ప్రజా ప్రతినిధుల మీదనే కదా. నిజానికి ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులే కదా.

ఇదే మాటను విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అంటే అది ప్రజా ప్రతినిధులు అధికారుల వల్లనే అని ఒక చక్కటి మాట చెప్పేశారు.

ప్రభుత్వం మంజూరు చేసిన పనులు అధికారులు పూర్తి చేయడం లేదని, అలాగే ప్రజా ప్రతినిధులు కూడా ఏ మాత్రం పట్టకుండా ఉంటున్నారని, దీని వల్ల పనులు కాక ప్రభుత్వానికే చివరికి చెడ్డ పేరు వస్తోందని అవంతి అన్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం భీమిలీలో తాజాగా జరిగిన మండల సర్వ‌ సభ్య సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజమే కదా అవంతి చెప్పింది కోపంగానో మరోగానో చూడాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

వారే నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కచ్చితంగా సర్కార్ బదనాం అవుతుంది. ఈ విషయాన్ని బహు చక్కగా వివరించారు అవంతి సార్. మరి ఇందులో మంచిని తీసుకుని పాటించడమే ప్రజా ప్రతినిధుల పని. అందునా అధికార ప్రజా ప్రతినిధులది ఇంకా కీలకమైన బాధ్యత.