Begin typing your search above and press return to search.

అమరావతిలో అలా చేస్తాం : మంత్రి అవంతి

By:  Tupaki Desk   |   13 Jun 2019 4:41 PM IST
అమరావతిలో అలా చేస్తాం : మంత్రి అవంతి
X
విజయవాడ రాజకీయ కేంద్రం.. విశాఖ సుందర తీరనగరం.. విశాఖ చుట్టుపక్కల ఆర్కే బీచ్, అరకు అందాలు.. బొర్రా గుహలు సహా ఎన్నో చూడముచ్చటైన ప్రదేశాలున్నాయి. అయితే వాటికి సరైన ప్రోత్సాహం లేదు. ప్రభుత్వ ఆదరణ లేదు.. దీంతో ఎంతో పర్యాటక అవకాశం ఉన్నా కూడా ఏపీకి టూరిస్టుల రాక రావడం లేదు. అందుకే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పర్యాటకాన్ని పోత్సహించేందుకు నడుం బిగించింది.

కొత్తగా పర్యాటక శాఖ మంత్రిగా నియామకమైన అవంతి శ్రీనివాస్ ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్ లో ప్రభుత్వ, ప్రైవేటు ఫంక్షన్లు చేసుకోవడానికి శిల్పారామం ఉన్నట్టే ఏపీలోనూ అలాంటిది నిర్మిస్తామని.. విజయవాడలో రాజధాని భూ కుంభకోణం దృష్ట్యా సరైన స్థలాన్ని ఎంపిక చేసి అది పూర్తి చేస్తామన్నారు.

ఇక ఏపీలోనే అత్యంత టూరిస్టులకు అనువైనది విశాఖ ఉందని.. అక్కడ పరిసర అరకు, బొర్రా గుహలు సహా పర్యాటక ప్రదేశాలు మారుస్తామని అవంతి పేర్కొన్నారు. లోకల్ గైడ్స్ తోపాటు ఇంగ్లీష్, హిందీ వచ్చిన వారిని పెట్టి విదేశీ, దేశ పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు..

గుజరాత్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి ఆ రాష్ట్రానికే చెందిన స్టార్ హీరో అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్టే.. తాము కూడా ఏపీకి ఓ స్టార్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఏంపిక చేస్తామన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు రూపొందించి ఏపీ సీఎం జగన్ కు విన్నవించి అభివృద్ధి చేస్తామని అవంతి తెలిపారు.