Begin typing your search above and press return to search.

ఉబర్, ఓలాలపై ఆటోవాలాల యుద్ధం

By:  Tupaki Desk   |   7 April 2017 2:27 PM IST
ఉబర్, ఓలాలపై ఆటోవాలాల యుద్ధం
X
పొట్టకూటికి ఆటోలు నడిపే హైదరాబాదీ ఆటోవాలాలు దిగ్గజ క్యాబ్ సంస్థలపై యుద్ధం ప్రకటించారు. ఇంతవరకు కార్లకే పరిమితమైన ఉబర్ - ఓలాలు ఇప్పుడు ఆటో సేవల్లోకి కూడా వస్తుండడంతో వారంతా ఆగ్రహిస్తున్నారు. తమ పొట్టకొట్టే పని వద్దంటూ నిరసన తెలుపుతున్నారు. ఓలా - ఉబర్ తీరుకు నిరసనగా శుక్రవారం నుంచి 24 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. ఓలా - ఉబర్ ఆటోల వల్ల తమ జీవనాధారం దెబ్బతింటోందని వారు వాపోతున్నారు.

అదేసమయంలో పెంచిన వాహనాల బీమా ప్రీమియంలు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆటోవాలాలపై భారం మోపొద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా ఆటోల బంద్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అదనంగా బస్సులు నడుపుతోంది.

కాగా ఆటోవాటాల పొట్ట కొడుతున్నారంటున్న ఓలా, ఉబర్ క్యాబ్ సేవల వల్ల రైల్వేలకు మాత్రం మంచి లాభం వస్తోందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. రైల్వే స్టేషన్ల వద్ద పార్కింగ్ కోసం ఈ సంస్థలు భారీ ధరకు కాంట్రాక్టులు తీసుకుంటున్నాయి. తమ సంస్థల క్యాబ్ లు ఆపుకొనేందుకు వీలుగా వార్షిక కాంట్రాక్టులు తీసుకుంటున్నాయి. ఒక్క బెంగళూరులోనే మూడు స్టేషన్లలో మూడేళ్లకు గాను 51 కోట్లకు ఓలా సంస్థ కాంట్రాక్టు తీసుకుంది. మొత్తం 100 క్యాబ్ లకు సరిపడా స్పేస్ తీసుకుంది. ఢిల్లీ - ముంబయి - కోల్ కతా - హైదరాబాద్ - చెన్నయిలోనూ ఇవే ప్రయత్నాలు చేస్తోంది. ఉబర్ కూడా ఇదే దారిలో ఉండడంతో రైల్వేల పంట పండనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/