Begin typing your search above and press return to search.
ఇటువంటి వాళ్లను ఏం చేయాలి..! నీళ్లు కలిపి పెట్రోలు అమ్ముతున్నారు?
By: Tupaki Desk | 14 Dec 2020 11:32 AM ISTపెట్రోలు అమ్మకాల్లో మోసాలు జరుగుతుండటం తరుచూ చూస్తూనే ఉంటాం. డిజిటల్ మీటర్లో సరిగ్గానే చూపినప్పటికీ లీటర్ పెట్రోల్ 30 ఎమ్ఎల్.. 50 ఎమ్ఎల్ తక్కువగా రావడం అప్పుడప్పుడూ కొన్ని బంకుల్లో జరుగుతోంది. దీనిపై వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేయడం.. వాళ్ల ఆ సమయం లో హడావుడి చేయడం కనిపిస్తుంటుంది. ఆ తర్వాత పెట్రోల్ బంక్ యజమానులు మళ్లీ అదే తరహా మోసాలకు తెరలేపుతుంటారు. అయితే ఏకంగా పెట్రోల్ల్లో నీళ్లు కలుపుతున్నట్టు కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. విజయవాడ ఆటోనగర్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తే నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
ఆదివారం ఆటోనగర్‌లో కొందరు వినియోగదారులు తమ వాహనాలకు ఆటోనగర్ పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి. మెకానిక్‌లకు చూపించగా పెట్రోల్‌లో నీళ్లు కలిశాయని చెప్పారట. దీంతో వాళ్లు అవాక్కయ్యారు. అయితే ఈ విషయంపై పెట్రోల్ బంక్ యజమానిని అడగాగా అవి నీళ్లు కావని ఇథనాల్ ఎక్కువ మొత్తంలో కలిసి ఉంటుందని తాపీగా చెప్పారట.10 కేఎల్ పెట్రోల్ లో ఒక కేఎల్ ఇథైనల్ కలపాలని అధికారులే సూచిస్తున్నారని .. కానీ ఇథనాల్ కొంచెం ఎక్కువగా కలిసి ఉంటుందని పెట్రోల్ పంప్ యజమాని తాపీగా సమాధానం చెప్పారు.
మరోవైపు నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా మోసాలకు నిలయంగా మారింది. ఇక్కడ తరుచూ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వాళ్ల తీరు మారలేదు. పెట్రోల్ బంక్ యాజమాన్యం చేస్తున్న దోపిడీని వినియోగదారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీశారు. కొక్కు పాడు రోడ్డు వద్ద నున్న ఇండియన్ పెట్రోల్ బంక్‌లో లీటరు పెట్రోల్ కొట్టించుకుంటే ముప్పావు వంతే రావడం చేసి వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. 100 రూపాయలకు పెట్రోల్ ఫీడ్ చేసి బాటిల్‌లో పెట్రోల్ పట్టించుకుంటే లీటర్ పెట్రోల్ మాత్రమే వచ్చింది.
కానీ 100 రూపాయలకు పెట్రోల్ వచ్చినట్లు డిజిటల్ మీటర్లో చూపిస్తున్నది. దీంతో వెంటనే పెట్రోల్ బంక్ యజమాన్యులు బంక్‌కు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల పెట్రోలు బంకుల్లో అక్రమాలు నిత్యకృత్యంగా మారాయి. అధికారులు కూడా బంక్ యజమానులతో కుమ్మక్కయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య తిరుపతిలో కూడా ఇలాంటి మోసాలే జరగడంతో యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.