Begin typing your search above and press return to search.

ఒక్క వీడియో జీవితాన్నే మార్చేసింది.. ఆటోడ్రైవర్​ టు సినిమా ఇండస్ట్రీ..!

By:  Tupaki Desk   |   17 March 2021 4:30 PM GMT
ఒక్క వీడియో జీవితాన్నే మార్చేసింది.. ఆటోడ్రైవర్​ టు సినిమా ఇండస్ట్రీ..!
X
సినిమాల్లో నటించాలని చాలామందికి ఉంటుంది. అందుకు తగ్గ ట్యాలెంట్​ కూడా ఉంటుంది. కానీ అవకాశాలు ఇచ్చే వాళ్లు ఉండరు. దీంతో ఫిలిం స్టూడియోల వద్ద, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ఇళ్ల వద్ద ఎందరో పడిగాపులు గాస్తుంటారు. అది ఒకప్పటి మాట.. ఇప్పుడంతా డిజిటల్​ యుగం. మన టాలెంట్​ ను ప్రదర్శించుకొనేందుకు ఓ వేదిక ఉంది. అదే సోషల్​మీడియా.. ఇలా సోషల్​మీడియాతోనే చాలా మంది పాపులర్​ అయిపోయారు. తాజాగా ఓ ఆటోడ్రైవర్​ కు సోషల్ ​మీడియా పుణ్యమాని సినిమా చాన్స్​ వచ్చింది. అతడు డ్యాన్స్​ వీడియో కు ఓ డైరెక్టర్​ ఫిదా అయిపోయి తన సినిమా లో అవకాశం ఇచ్చాడు. మహారాష్ట్ర లో ఈ ఘటన చోటుచేసుకున్నది.

మహారాష్ట్ర, పూణె సిటీకి దగ్గర లోని బారామతి కు చెందిన బాబాజి కాంబ్లే ఆటో‌డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలని కోరిక ఉండేది. దీంతో డ్యాన్స్​ నేర్చుకున్నాడు. అతడి డ్యాన్స్​ కు చుట్టు పక్కల గ్రామాల్లో ఫ్యాన్స్​ కూడా ఉన్నారు. అప్పడప్పుడు అతడు రోడ్ల మీద డ్యాన్స్​ చేస్తుంటాడు.

ఇటీవల అతడి డ్యాన్స్​ను కొందరు మిత్రులు వీడియో తీసి సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్​ అయిపోయింది. ‘మల జావు ధ్యానా ఘరి’ అనే పాటకు మహారాష్ట్ర పాపులర్ డ్యాన్స్ ‘లవని’ స్టైల్‌లో అతడు డ్యాన్స్​ చేశాడు. ఎంతో గ్రేస్​తో బాబాజీ డాన్స్​ చేయడం తో చాలా మంది ఆ డాన్స్​ కు ఫిదా అయ్యారు. లోకల్​ ట్యాలెంట్​ అదుర్స్ అంటూ కామెంట్లు పెట్టారు.

సోషల్​మీడియాలో ఈ డ్యాన్స్​ ట్రెండింగ్ ​లో నిలిచింది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ ఈ డాన్స్​ వీడియోను ట్వీట్టర్​ లో పోస్ట్​ చేశాడు. ఈ డ్యాన్స్​ చూసిన మరాఠి ఫిల్మ్ డైరెక్టర్ ఘన్‌ శ్యామ్ విష్ణు ‌పంత్ యేడే ఫిదా అయ్యాడు. తన సినిమాలో అతడికి అవకాశం ఇవ్వాలని భావించాడు. అనుకున్నదే తడువుగా కాంబ్లీకి ఫోన్​చేసి విషయం చెప్పాడు. దీంతో బాబాజీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లోకల్​ ట్యాలెంట్​కు మంచి గుర్తింపు దక్కిందంటూ సోషల్​మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.