Begin typing your search above and press return to search.

ప్రేక్షకులు లేకుండానే భారీ సిరీస్ కు సీరియస్ ప్లానింగ్

By:  Tupaki Desk   |   23 April 2020 6:00 AM IST
ప్రేక్షకులు లేకుండానే భారీ సిరీస్ కు సీరియస్ ప్లానింగ్
X
మాయదారి కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలమైపోతోంది. నిన్నమొన్నటివరకూ ధిలాసాగా ఉన్నవారంతా ఇప్పుడు భవిష్యత్తు భయాందోళనలో మునిగిపోయారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా భారీగా ప్రభావితమైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. క్రీడలన్నంతనే మందితో కలిసి ఆడటం.. ఆ ఆటను చూసేందుకు వేలాది మంది ఒకే చోటకు రావటం తెలిసిందే. కరోనా వేళ భౌతిక దూరాన్ని పక్కాగా పాటించాల్సిన నేపథ్యంలో ఆటల్ని బంద్ చేయటం తెలిసిందే. దీంతో.. క్రీడల్ని నమ్ముకున్న సంస్థలు భారీగా నష్టపోతున్నాయి.

అందులో ఒకటి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. కరోనా కారణంగా ఆసీస్ క్రికెట్ బోర్డు షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక సమస్యలు గుదిబండలా మారి ఉనికికే ప్రమాదంగా మారిన దుస్థితి. ఇలాంటి వేళ.. షెడ్యూల్ ప్రకారం ఈ డిసెంబరు లో భారత్ తో జరగాల్సిన క్రికెట్ సిరీస్ ను యథాతధంగా ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ టెస్టు సిరీస్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని భావిస్తోంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా ఖాళీ స్టేడియంలో ఆటను నిర్వహించాలని భావిస్తోంది. టీవీ హక్కుల రూపంలోభారీ ఎత్తున నిధుల్ని సమీకరించాలని భావిస్తోంది. అంతేకాదు.. టెస్టు సిరీస్ ను వేర్వేరు వేదికల మీద కాకుండా.. ఒకే వేదిక మీదన ఆడించేలా జాగ్రత్తలు తీసుకునేలా ప్లాన్ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్ భారత్.. ఆస్ట్రేలియాల మధ్య జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 20 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లను నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

అందుకే.. భారత్ తో జరగాల్సిన క్రికెట్ సిరీస్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకో రాదని భావిస్తోందా దేశం. పరిస్థితులు డిసెంబరు నాటికి చక్కబడితే ఇబ్బంది లేదని.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నా.. అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ.. అలాంటిదే జరిగితే.. ప్రేక్షకులను రానివ్వకుండానే సిరీస్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు.