Begin typing your search above and press return to search.
మ్యాచ్‌లో బూతులు తిట్టి.. ఇప్పుడేమో క్షమాపణలా?
By: Tupaki Desk | 12 Jan 2021 2:38 PM ISTఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ లు మెరుగ్గా రాణించి మ్యాచ్‌ను డ్రా చేసిన విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో తమ ప్రదర్శనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. అయితే మూడో టెస్ట్ ఆఖరి రోజు హనుమ విహారీ.. రవిచంద్రన్ అశ్విన్ ఎంతో ఓపిగ్గా ఆడి వికెట్లను నిలబెట్టి చాలా సేపు క్రీజ్‌లో ఉన్నారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే రవిచంద్రన్, విహారి క్రీజ్‌లో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్.. విచక్షణ కోల్పోయాడు. ఈ సందర్భంగా అశ్విన్‌పై బూతుల వర్షం కురిపించాడు. అయితే అశ్విన్ కూడా దీటుగానే బదిలిచ్చాడు.
కాగా పైన్ మాటలు స్టంప్‌మైక్‌లో రికార్డయ్యాయి. దీంతో అతడిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కీలక సమయాల్లో ప్రత్యర్థి జట్టుపై తిట్ల వర్షం కురిపించడం ఆస్ట్రేలియాకు కొత్త కాదు. గతంలోనూ పలుమార్లు ఇటువంటి ఘటనలు జరిగాయి. తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయ్యింది.
అయితే పైన్ మాటలపై విమర్శలు రావడంతో అతడు క్షమాపణ చెప్పాడు. ‘క్రికెట్లో స్టంప్‌మైక్ ఉంటుందని తెలుసు. అయితే నేను దురదృష్టవశాత్తు నోరుజారాను. అలా చేసి ఉండాల్సింది కాదు. గేమ్ లో జాగ్రత్తగా ఉండాలని తెలుసు. కానీ నేను సహనం కోల్పోయా. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటా’ అంటూ కిమ్ పేర్కొన్నారు.
మూడో రోజు ఆటలో పుజారా ఔట్ కోసం పైన్ అంపైర్ విల్సన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. దాంతో పైన్‌పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.
ఆఖరిరోజు మ్యాచ్ సాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్.. హనుమ విహారి క్రీజులో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా బౌలర్ లైయన్ బౌలింగ్ వేస్తుండగా.. అశ్విన్ చెస్ట్గాడ్ కోసం క్రీజు నుంచి బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా కీపింగ్ చేస్తున్న పైన్.. 'గబ్బా(చివరి టెస్టు వేదిక)కు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఆత్రుతగా ఉన్నా యాష్.. చెప్పింది అర్థమైందా'' అంటూ రెచ్చగొట్టాడు. ‘మేం కూడా మిమ్మల్ని భారత్‌కు రప్పించాలనే తొందరలో ఉన్నాం. నీకది చివరి సిరీస్ అవుతుంది'అని అశ్విన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అయితే పైన్ మాటలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.