Begin typing your search above and press return to search.

ఆంధ్ర లో కరోనా కట్టడికి అరబిందో ఫార్మసీ భారీ విరాళం!

By:  Tupaki Desk   |   2 April 2020 5:38 PM IST
ఆంధ్ర లో కరోనా కట్టడికి అరబిందో ఫార్మసీ భారీ విరాళం!
X
రాష్ట్రంలో ప్రభలుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణాచర్యలకు తమవంతు సాయంగా సామాజిక బాధ్యతగా చేయందించేందుకు పలువురు ప్రముఖులు - పలు సంస్థలు అడుగులు ముందుకు వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మసీ సంస్థ కూడా తమవంతు సాయాన్ని అందించడానికి ముందుకు రావడం హర్షణీయం. అందులో భాగంగానే అరబిందో ఫార్మసీ హోల్ టైం డైరెక్టర్ శ్రీ శరత్ చంద్రా రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి సమక్షంలో ముఖ్యమంత్రి సహాయనిధికి తమవంతు సాయంగా 7.5 కోట్ల రూపాయల చెక్కును మిగిలిన 3.5 కోట్ల రూపాయలను మందులు మరియు సానిటరీ సామాగ్రి నిమిత్తం కలిపి మొత్తంగా అక్షరాలా 11 కోట్ల రూపాయలు విరాళంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి గారికి అందించడం జరిగింది.