Begin typing your search above and press return to search.

రోనాల్డోపై ప్రెసిడెంట్ ఆడియో లీక్

By:  Tupaki Desk   |   15 July 2021 5:55 AM GMT
రోనాల్డోపై ప్రెసిడెంట్ ఆడియో లీక్
X
అంతర్జాతీయ ఫుట్ బాల్ లో దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో. ఈ పోర్చుగీస్ ఆటగాడు ఫుట్ బాల్ లో మేటి క్రీడాకారుడు. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతటి దిగ్గజ ఆటగాడంటే అభిమానులు పడిచస్తారు.

ఇక పోర్చుగల్ తోపాటు రోనాల్డో ‘రియల్ మాడ్రిడ్’ అనే క్లబ్ తరుఫున కూడా ఫుట్ బాల్ ఆడుతారు. ఆ రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరోజ్ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యి సంచలనమైంది. ఈ ఆడియోలో పెరోజ్ దిగ్గజ ఆటగాడు రోనాల్డో గురించి అసలు నిజాలు వెల్లగక్కాడు. ‘రోనాల్డో ఒక ఇడియట్.. జబ్బుపడిన వ్యక్తి. అతడికి అహం ఎక్కువగా ఉంది. ’ అని తీవ్ర విమర్శలు గుప్పించాడు. బయటకు అతడు సాధారణంగా సాధారణంగా ఉన్నాడు అనుకుంటాడు కానీ అతడంత మంచివాడు కాదని ఆడియోలో పేర్కొన్నాడు.

రోనాల్డో నిజస్వరూపం గురించి పెరోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రోనాల్డో చేయాల్సిన పనులు చేయరు.. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు.. కానీ ఏమీ చేయడు’ అంటూ పెరోజ్ విమర్శలు గుప్పించారు.

వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు.. మనం ఈరోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం.. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రోనాల్డోను 2009 వేలంలో మాంచెస్టర్ యూనైటెడ్ నుంచి 80 మిలియన్ పౌండ్ల రికార్డు ధరతో వేలంలో రియల్ మాడ్రిడ్ కొనుగోలు చేసింది. క్లబ్ ఫుట్ బాల్ లో ప్రముఖ గోల్ స్కోరర్ గా రోనాల్డో ఉన్నాడు. మాడ్రిడ్ లో ఉన్నప్పుడు రోనాల్డో నాలుగు బాలన్-డి అవార్డులను కూడా గెలుచుకున్నాడు.