Begin typing your search above and press return to search.

భర్తతో స్నేహంగా ఉంటోందని యువతిపై కిరాయి యువకులతో అత్యాచారయత్నం

By:  Tupaki Desk   |   30 May 2022 10:00 AM IST
భర్తతో స్నేహంగా ఉంటోందని యువతిపై కిరాయి యువకులతో అత్యాచారయత్నం
X
హైదరాబాద్ లోని కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తతో యువతి సన్నిహితంగా ఉంటోందని భావించిన గాయత్రి అనే మహిళ నలుగురు యువకులతో కలిసి యువతిపై అత్యాచారయత్నం చేయించింది. యువతిని ఇంటికి పిలిచి బంధించి యువకులతో అత్యాచారయత్నం చేసినట్లు తెలుస్తోంది. యువతిని నగ్నంగా మార్చి ఈ ఘటనను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు బాధిత యువతి పేర్కొంది.

తనను చిత్రహింసలకు గురిచేసిన యువకులు, గాయత్రిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులతోపాటు గాయత్రిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

అసలేం జరిగిందంటే?శ్రీకాంత్ కుటుంబం, బాధిత యువతి కొండాపూర్ లోని కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.

ఇద్దరూ స్నేహంగా ఉండడంపై అనుమానంతో భార్య గాయత్రి ఈ యువతిని ఇంటికి పిలిపించింది.యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసి నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించింది. యువతిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనమైంది.

యువతి నోట్లో గుడ్డలు కుక్కిన యువకులు ఆమెను తీవ్రంగా హింసించారు. ఆ తర్వాత యువతిపై నలుగురు యువకులు లైంగిక దాడికి యత్నించారు. ఈ దారుణాన్ని గాయత్రి సెల్ ఫోన్ లో చిత్రీకరించింది.

ఈ ఘటనపై ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించింది. తీవ్రంగా గాయపడిన యువతిని ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాయత్రితోపాటు నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.