Begin typing your search above and press return to search.

కేపిటల్ హౌస్ పై దాడి... ఇద్దరు సస్పెండ్ , ఒకరు అరెస్ట్ !

By:  Tupaki Desk   |   12 Jan 2021 2:00 PM IST
కేపిటల్ హౌస్ పై దాడి... ఇద్దరు సస్పెండ్ , ఒకరు అరెస్ట్ !
X
కేపిటల్ హౌస్ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అందులో భద్రతా వైఫల్యం కూడా ఉందని రూడీ అవుతోంది. ఘటనకు బాధ్యత వహించిన ఇద్దరు కేపిటల్ పోలీస్ ఆఫీసర్స్‌ ను సస్పెండ్ చేశారు. మరొకరినీ అరెస్ట్ చేశారు. వీరు ట్రంప్ మద్దతుదారులకు సపోర్ట్ చేశారని అభియోగాలు మోపారు.

కేపిటల్ హౌస్‌ లో సభ్యులపై దాడికి వస్తే భద్రతా సిబ్బంది ఏం చేశారని ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. కేపిటల్ పోలీస్ చీఫ్, ఇతర ఉన్నతాధికారులు రాజీనామా చేయాలని ఒహియ డెమోక్రాట్, లెజిస్లేటివ్ బ్రాంచ్ సబ్ కమిటీ చైర్మన్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తప్పవని ఉన్నతాధికారులు తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని పార్లమెంట్ భవనం లో సమావేశమైన అమెరికా కాంగ్రెస్.. బైడెన్ విజయాన్ని ఖరారుచేసే ప్రక్రియ చేపట్టగా ట్రంప్ అభిమానులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తుపాకులు, బాంబుల మోతతో పార్లమెంట్ బిల్డింగ్ దద్దరిల్లింది. ఈ ఘటనపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి.