Begin typing your search above and press return to search.
ప్రేమ పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె భర్తపై దాడి!
By: Tupaki Desk | 15 July 2019 1:24 PM ISTవారం రోజులుగా యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ప్రేమ వివాహంపై సాగుతున్న పరిణామాలు తెలిసిందే. ఇంట్లో వారికి తెలీకుండా దళితుడైన వ్యక్తిని సాక్షి మిశ్రా వివాహం చేసుకోవటం.. తమపై తన తండ్రి అనుచరులు దాడికి ప్రయత్నిస్తున్నారని.. తమను చంపేస్తారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే.
ఈ వీడియో వైరల్ గా మారటం.. యూపీకి చెందిన పోలీసులు స్పందించి వారికి రక్షణ ఇస్తామని చెప్పటం తెలిసిందే. ఇదే సమయంలో సాక్షి పెళ్లాడిన అజితేష్ కు గతంలోనే ఎంగేజ్ మెంట్ జరిగిందని.. కట్నం అదనంగా కోరటంతో తాము పెళ్లి రద్దుచేసుకున్నట్లుగా ఒక ఫిర్యాదు అందింది.ఇదే సమయంలో సాక్షి తండ్రి కమ్ బీజేపీ ఎమ్మెల్యేను మీడియా సంప్రదించగా.. తన భార్య ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని.. తమను వదిలిపెట్టాల్సిందిగా ఆయన వ్యాఖ్యానించారు.
ఓవైపు ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. మరోవైపు ఈ రోజు ఉదయం తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సాక్షి.. ఆమె భర్త అజితేష్ లు పోలీసులు సెక్యురిటీ నడుమ కోర్టుకు అలహాబాద్ హైకోర్టుకు హాజరయ్యరు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాల మధ్య అజితేష్ మీద దాడి జరిగింది. తమ తండ్రి అనుచరుల కారణంగా తమకు ప్రాణహాని ఉందంటూ సాక్షి పేర్కొన్నట్లే దాడి జరగటం సంచలనంగా మారింది.
అయితే.. ఈ దాడి కేవలం అజితేష్ మీదనే జరగటం.. అది కూడా పోలీసుల రక్షణ మధ్యలో ఉండగా చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. దాడి జరుగుతున్న సమయంలో ఎవరూ కూడా సాక్షి మీద దాడికి ప్రయత్నించకపోవటం గమనార్హం. దీనిపై అజితేశ్ న్యాయవాది మాట్లాడుతూ.. కోర్టు హాలులోకి వెళుతున్న సమయంలోనే దాడి జరిగిందని..అది కూడా పోలీసుల రక్షణలో ఉన్నప్పుడే చోటు చేసుకోవటం చూస్తే.. ఈ దాడి ఎవరు చేశారో అర్థం చేసుకోవచ్చాన్నారు. సినిమాటిక్ మలుపులు తిరుగుతున్న ఈ ఉదంతం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.