Begin typing your search above and press return to search.

కారులో లేని బండి మీద హత్యాయత్నం జరిగిందా?

By:  Tupaki Desk   |   1 Dec 2020 10:30 AM IST
కారులో లేని బండి మీద హత్యాయత్నం జరిగిందా?
X
గతంలో ఎప్పుడూ లేని రీతిలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం యమా హాట్ హాట్ గా మారటమే కాదు.. మాటలుతూటాల్లా మాదిరి పేలాయి. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం ముగిసి.. కీలక పోలింగ్ కు కేవలం కాసిన్ని గంటలే మిగిలాయి. ఇలాంటివేళలో.. చిన్న చిన్న ఉదంతాలు పెద్దవిగా మారటమే కాదు.. జరిగిన దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా సాగుతున్న ప్రచారం గురించి తెలిస్తే షాక్ తో అవాక్కు అవ్వాల్సిందే.

నెక్లెస్ రోడ్డు దగ్గర తన సన్నిహితులతో బండి సంజయ్ సరదాగా గడపటానికి వెళ్లటం. డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపణలు రావటం.. ఆ ప్రాంతం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సీన్లోకి వెళ్లటం.. తాము కోరినట్లుగా తనిఖీలు చేయాలని పట్టుబట్టటం.. అలాంటిదేమీ లేదని పోలీసులు చెబుతున్నా వినకుండా ఆందోళన చేపట్టటం..వెరసి ఆ ప్రాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఖైరతాబాద్ దగ్గర చోటు చేసుున్న ఈ ఉదంతంలో తప్పుడు సమాచారంతో బండి సంజయ మీద ఎలాంటి హత్యాయత్నం జరగని పరిస్థితి. అయినప్పటికీ ఏదో జరిగిపోయినట్లుగా బిల్డప్ లు ఇవ్వటం.. పలు టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ కింద వేయటం కనిపించింది.

ఇక్కడ పోలీసుల తీరును అభినందించాల్సిందే. ఘటన జరిగిన వెంటనే పోలీసులు రావటం.. ఆ వెనుకనే డీసీపీ విశ్వ ప్రసద్ రంగంలోకి దిగి.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ జరుగుతున్న తప్పల్ని సరిచేసే ప్రయత్నం చేయటమే కాదు.. హైదరాబాదీయులు అదే పనిగా తమ వరకు వచ్చే పోస్టులు.. కామెంట్లలో పస ఎంతన్నది చెక్ చేసుకోవాలే కానీ.. త్వరగా అందరికి తెలీయజేయాలన్న ఉద్దేశంతో అదే పనిగా వైరల్ చేయటం తప్పే అవుతుంది. సో.. పోలింగ్ ప్రక్రియ మొదలై.. పూర్తి అయ్యే వరకు ఎలాంటి తొందరపాటుకు గురి కావొద్దన్న విషయాన్ని నగర వాసులు అనుక్షణం గుర్తించుకోవటం చాలా.. చాలా మంచిది.