Begin typing your search above and press return to search.

ప్రేమ జంట పై దాడి .. కిరాతకంగా చంపి , ఆ తర్వాత ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   30 Jan 2021 6:11 PM IST
ప్రేమ జంట పై  దాడి .. కిరాతకంగా చంపి , ఆ తర్వాత ఏంచేశారంటే ?
X
ఉత్తరప్రదేశ్ ‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బరేలి జిల్లా మీర్‌గంజ్‌ లో ప్రేమ జంటపై దాడి చేసి అత్యంత పాశవికంగా చంపేశారు. వారిద్దరూ చనిపోయిన అనంతరం చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటన దేశవ్యప్తంగా కలకలం సృష్టిస్తుంది. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ... బరేలీ జిల్లాలోని మీర్ గంజ్‌కి చెందిన యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. గురువారం వారిద్దరూ మాట్లాడుకుంటుడగా యువతి బంధువులు చూశారు. దీంతో వారిద్దరిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారిద్దరూ చనిపోయేంత వరకు కొట్టి ఆ ప్రాంతంలో ఉన్న చెట్టుకు వేలాడదీశారు. ఈ విషయం తెలిసిన యువకుడి తల్లీదండ్రులు ఘటనాస్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పోలీసులు చేరుకొని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ పాశవిక దాడిపై యువకుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసుపై విచారించిన పోలీసులు బాలిక మేనమామ, ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రేమికులను చంపిన అనంతరం ఆత్మహత్యగా చిత్రించేందుకు వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదికలో వారిని హత్య చేసినట్టు వెల్లడైందని తెలిపారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ దాడి ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.