Begin typing your search above and press return to search.

4జీనే దిక్కులేదు.. అక్కడేమో 5జీ టెస్టింగ్?

By:  Tupaki Desk   |   15 Feb 2016 7:30 PM GMT
4జీనే దిక్కులేదు.. అక్కడేమో 5జీ టెస్టింగ్?
X
టెక్నాలజీ పరంగా మనం చాలానే వెనుకబడి ఉన్నామన్న విషయంలో సందేహం లేదు. అయితే.. ప్రాశ్చాత్య దేశాలకు మనకు మధ్య అంతరం ఎంత ఎక్కువగా ఉందన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టం కావటమే కాదు.. మన అభివృద్ధి మరెంత ఫాస్ట్ గా ఉండాలో చెప్పకనే చెప్పేస్తుంది. మన దేశంలో బీఎస్ ఎన్ ఎల్ గుత్త నుంచి టెలికం బయటకొచ్చి.. ప్రైవేటు ఆపరేటర్ల రాకతో టెలికాం ఎంతలా అభవృద్ధి చెందిందో తెలిసిందే. టెలికాం ద్వారా కేంద్రానికి సమకూరుతున్న మొత్తం తక్కువేం కాదు. మరింత ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి పెట్టినా.. అత్యాధునికి సాంకేతికతను ప్రజలకు అందేంచే విషయంలో ప్రభుత్వం.. ప్రైవేటు ఆపరేటర్లు చాలానే వెనుకగా ఉన్నారు. 2జీ నుంచి 3జీకే ఇంకా చాలామంది రావాల్సిన సమయంలో.. 4జీ అందుబాటులోకి రావటం.. 3జీకి 4జీకి మధ్య వ్యత్యాసం పెద్దగా కనిపించటం లేదన్న మాట వినిపిస్తున్న పరిస్థితి.

మన దగ్గర పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు అమెరికాలో పరిస్థితి మరోలా ఉంది. ఆ దేశంలోని టెక్సాస్ కు చెంది ఎటీ అండ్ టీ టెలికాం సంస్థ 5జీ నెట్ వర్క్ పై పరీక్షలు జరుపుతోంది. డేటా పంపిణీ విషయంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వేగానికి వంద రెట్లకు పైనే ఫాస్ట్ గా ఉండే నెట్ వర్క్ 5జీ ద్వారా లభిస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 5జీ టెక్నాలజీని పరీక్షించాలని భావిస్తున్నారు.

వాస్తవానికి 5జీ నెట్ వర్క్ ను 2020 నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రయత్నం అయితే.. కొన్ని కంపెనీలు మాత్రం అంతవరకు ఎందుకు వెయిట్ చేయటమన్న ఆలోచనలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాయు వేగంతో సాగే డేటా బదిలీ.. మారుమూల ప్రాంతాలకు సైతం సులువుగా.. అత్యంత వేగంగా నెట్ వర్క్ ను అందించే వీలు 5జీ నెట్ వర్క్ లో ఉంటుందని చెబుతున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీ మీద ఇంటెల్.. ఎరిక్ సన్ లు పరీక్షలు జరుపుతున్నాయి. ఈ లెక్కన నెట్ వర్క్ విషయంలో మనం ఎంత దూరంలో ఉన్నామో కదూ..?