Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ యుద్ధంలో ఘోరాలు.. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు

By:  Tupaki Desk   |   28 April 2022 2:30 PM GMT
ఉక్రెయిన్ యుద్ధంలో ఘోరాలు.. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు
X
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం వద్దనే వాదనలు వస్తున్నా రష్యా మాత్రం లెక్క చేయడం లేదు.ఫలితంగా ఉక్రెయిన్ శశ్మానంలా మారుతోంది.. ఇక్కడ రష్యా సేనలు దారుణాలకు ఒడిగడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ వాసులపై అమానవీయ ఘటనలకు పాల్పడుతోందని అంతర్జాతీయ సమాజం విమర్శలు చేస్తోంది. అయినా రష్యా మాత్రం తగ్గడం లేదు తన కర్కశతత్వంతో ముందుకు వెళ్తోంది.

యుద్ధం వల్ల ఉక్రెయిన్ కే కాదు.. రష్యాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. రష్యా ఇప్పటివరకూ 24వేల మందికి పైగా సైనికులను కోల్పోయింది. అయినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన డొనెట్స్య్, ఖర్కీవ్ వంటి ప్రాంతాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక సామాన్యులపై దాడులు చేయడం లేదని.. ఉక్రెయిన్ సైన్యాన్నే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన పుతిన్.. ఇప్పుడు ఆ మాట తప్పారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉక్రెయిన్ లోని మహిళలు, చిన్నారులనూ రష్యా సైనికులు వదలడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రష్యా సైనికులపై దాదాపు 400 కు పైగా అత్యాచార కేసులు నమోదైనట్టు ఉక్రెయిన్ అంబుడ్స్ మెన్ లియుడ్ మైలా డెనిసోవా వెల్లడించారు. లైంగిక హింసకు సంబంధించి నివేదించేందుకు హాట్ లైన్ ఏర్పాటు చేయగా.. ఏప్రిల్ 1 నుంచి 14 మధ్యకాలంలో తమ కార్యాలయానికి దాదాపు 400కు పైగా లైంగిక హింసకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. బాధితుల్లో ఉక్రెయిన్ చిన్నారులు కూడా ఉన్నట్టు ఆ దేశం ఆరోపిస్తోంది.

ష్యా సేనలు తల్లులపై సామూహిక అత్యాచారం, పసిపాపలపై లైంగిక దాడులు అందరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పుతిన్ సేనల తీరు వివాదాస్పదమవుతోంది. మనుషులను హింసించమనే నినాదంతో వచ్చిన రష్యా సేనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉక్రెయిన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పలు స్వచ్ఛంధ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

రష్యా సైనికుల దారుణాలపై తొమ్మిది ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. 12 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక దాడులు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో రష్యా ఘాతుకాలకు అంతే లేకుండా పోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ను రష్యా సేనలు నిలువెల్లా దోచేందుకు తయారుగా ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను సైతం పెడచెవిన పెడుతూ వారి సాగిస్తున్న మారణహోమానికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో తెలియడం లేదు.

ఫిబ్రవరి 24న మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నానాటికి పెరుగుతోంది. మహిళలు, చిన్నారులపై లైంగికదాడి చేయడం అత్యంత పాశవిక చర్యగా అభివర్ణిస్తున్నారు. రష్యా సేనల తీరుతో విమర్శలు వస్తున్నా పుతిన్ మాత్రం ఇది మాపై నిందలు మోపేందుకే జరుగుతున్న దురాగాతాలుగా చెబుతుండటం విశేషం. రష్యా ఆగడాలపై దర్యాప్తు చేయాలనే వాదనలు కూడా వస్తున్నాయి.

గత 63 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో 24200 మందికి పైగా రష్యా తన సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ రష్యా 1300 క్షిపణులను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ డిప్యూటీ రక్షణ మంత్రి అన్నా మలయార్ తెలిపారు. యుద్ధం మొదలైన తర్వాత రష్యాలో క్షిపణులు నిల్వలు సగానికి పడిపోయాయన్నారు.

ఇక రష్యా యుద్ధంలో 217మంది చిన్నారులు మృతి చెందగా.. ఇప్పటివరకూ 610 మందికి పైగా గాయపడినట్లు ఉక్రెయిన్ తెలిపింది.