Begin typing your search above and press return to search.

అమెరికాలో దారుణం... ప్రాణం తీసిన ఆశయం..!

By:  Tupaki Desk   |   26 Jan 2022 2:55 AM GMT
అమెరికాలో దారుణం... ప్రాణం తీసిన ఆశయం..!
X
ఆ గ్రామంలో వారికి అమెరికాకు వెళ్లడమంటే ఓ ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తారు. ఇంకా చెప్పాలంటే అగ్రరాజ్యంలో స్థిరపడిన కుటుంబాల అంటే ఇంత గొప్పగా చూస్తారు. ముఖ్యంగా ఆ గ్రామంలో నివసించే పటేల్ సామాజిక వర్గానికి అమెరికాలో అడుగు పెట్టడం అనేది ఒక ప్రతిష్ట కింద భావిస్తారు. అయితే వీరంతా అమెరికాలో స్థిరపడడం కోసం ఏళ్లకు ఏళ్లుగా కష్టపడి పని చేసిన డబ్బును కూడ పెట్టుకొని మరి ఆ కలను నెరవేర్చుకోవాలని చూస్తారు. అయితే ఇలా జీవిత కాల ఆశయంగా ఉండి.. అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడాలని భావించిన ఒక కుటుంబం తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోయింది. వారు కన్న కలే వారిని కానరాని లోకాలకు చేర్చింది. కేవలం పెద్ద వయసు ఉన్న వారు మాత్రమే కాదు.. వారితో పాటు తీసుకుని పోయిన చంటిపిల్లలు కూడా మృత్యువు ఒడికి చేరుకున్నారు. దీనికి గల కారణం ఆ కుటుంబం నుంచి వెళ్లిన వారు అమెరికాలోకి ప్రవేశించేటప్పుడు అతి శీతలమైన వాతావరణంలో చిక్కుకుని వారి శరీరాలు ఆ చలికి గడ్డకట్టుకుని చనిపోయారు. ఈ వార్త తెలిసిన గ్రామస్తులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. ఇంతటికీ వీరి కథ? ఎలా చనిపోయారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అది గుజరాత్ లోని ఒక చిన్న గ్రామం. ఆ రాష్ట్ర రాజధాని అయిన గాంధీనగర్ కు గట్టిగా కూతవేటు దూరంలో ఉంటుంది. ఆ గ్రామం పేరే డింగుచా. సాధారణంగా ప్రతి ఒక్కరికి అమెరికాలో ఉండటం అనేది ఒక కల. అయితే ఈ గ్రామం లో ఉండే వారికి మాత్రం అది ఒక హోదా తో సమానం. అందుకే 1970 ల నాటి నుంచి కూడా ఈ గ్రామం నుంచి ఎంతోమంది అమెరికాకు వలస వెళ్లారు. వీరికి అమెరికా అంటే ఏంత పిచ్చి అంటే... నిజానికి ఈ గ్రామంలో ఉండే మొత్తం జనాభా 3,000 అయితే అందులో సుమారు 18 వందల మందికి పైగా అమెరికా పర్యటన చేసిన వారే. దీనికి గల ప్రధాన కారణం... ఓ కుటుంబం అమెరికాలో ఉంది అంటే ఆ గ్రామంలో వారిని ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. మరెంతో గౌరవిస్తారు. ఇలా జరగడం అనేది ఈరోజుది మాత్రమే అనుకుంటే పొరపాటే. కొన్ని దశాబ్దాలుగా వీరు ఏదో ఒక రూపంలో అగ్రరాజ్యానికి చేరుకుంటున్నారు. కొంతమంది అక్కడికి వర్క్ వీసా మీద అక్కడికి వెళ్తే.. మరి కొంతమంది ఎలా గోలా అమెరికాకు చేరుకోవాలని ఏమాత్రం అనుభవం లేని ఏజెంట్లను నమ్మి బలవుతున్నారు. ఈ రెండో వర్గం వారు చచ్చినా.. బతికినా.. గ్రామంలో ఉండే వారికి ఏమీ పట్టదు. కేవలం వారు అమెరికా వెళ్లారు అనేమాట మాత్రమే మిగులుతుంది.

ఇలా కోటి ఆశలతో వెళ్లిందే.. జగదీష్ పటేల్ కుటుంబం. ఈ డింగుచా గ్రామం నుంచి చాలామంది దొంగ దారుల్లో అమెరికా చేరుకున్నట్లుగానే వారు కూడా అమెరికాలోకి ప్రవేశించాలి అనుకున్నారు. కానీ వారిని మృత్యువు హిమపాతంలో రూపంలో కబళించింది. మైనస్ 35 సెంటిగ్రెడ్ శీతలంలో శరీరాలు గడ్డగట్టుకు పోయి కెనడా, అమెరికా సరిహద్దుల్లోనే కన్నుమూశారు. ఈ క్రమంలోనే వారి దగ్గర ఉండే చిన్నారులు కూడా బలి కావాల్సి వచ్చింది. అయితే వీరి మృత దేహాలను గుర్తించగా అవి గుజరాత్ నుంచి అమెరికా వెళ్లాలని బయలుదేరి వెళ్లిన జగదీష్ కుటుంబానిది. చనిపోయిన వారిలో పటేల్ మాత్రమే గాక అతని భార్య వైశాలి, ఇద్దరు పిల్లలు విహంగ, ధార్మిక్ లు కూడా ఉన్నారు. వీరు పది రోజు క్రితం కెనడాకు వెళ్లారని బంధువు చెప్తున్నారు. అయితే అక్రమ వలస ప్రకారం వారు అమెరికా సరిహద్దు దాటుకుని ఆ దేశంలోకి ప్రవేశించాలని వారి కోరిక. ఈ లోపే ఈ దారుణం జరిగినట్లు పేర్కొన్నారు.

అమెరికాలోకి అక్రమ వలసలు అనేవి ప్రాణాలతో చలగాటం లాంటివి. దొరికితే చిత్రవధ చేస్తారు. చాలామంది ఎక్కువగా అమెరికాలోకి అక్రమంగా వెళ్లాలి అంటే ఒకటి కెనడా కాగా.. మరో కటి మెక్సికో. ఈ రెండు దేశాల నుంచే ఎక్కువగా వలస పోతుంటారు. ఎటువైపు నుంచి పోవాలన్నా కానీ వారికి ఇబ్బందులు తప్పవు. మెక్సికో వైపు ఎక్కువగా వేడి ఉండే కెనడా వైపు ఎక్కువగా చలి ఉంటుంది. ఈ చలిగాలులకు కురిసిన మంచు కారణంగా జగదీష్ కుటుంబం చనిపోయింది. అయితే అక్రమ వలసలను నివారించేందుకు అప్పటి ట్రంప్ ప్రభుత్వం ఓ పెద్ద గోడను కూడా నిర్మించింది.