Begin typing your search above and press return to search.

విత్ డ్రా అమౌంట్ ను పెంచుతూ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   14 Nov 2016 4:12 AM GMT
విత్ డ్రా అమౌంట్ ను పెంచుతూ కీలక నిర్ణయం
X
పెద్దనోట్ల రద్దు అనంతరం.. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే మొత్తంపై పలు నిబంధనల్ని కేంద్రం విధించిన సంగతి తెలిసిందే. ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే మొత్తాన్ని.. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ద్వారా తెచ్చుకునే మొత్తానికి సంబంధించిన పరిమితుల్ని కేంద్రం తాజాగా సవరించింది. విత్ డ్రా చేసుకునే మొత్తం ఏ మాత్రం సరిపోవటం లేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్న వేళ.. కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విత్ డ్రా మొత్తం తక్కువగా ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్న విషయాన్ని పసిగట్టిన కేంద్రం.. వీలైనంతవరకూ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏమేం చర్యలు చేపట్టాలన్న అంశంపై ప్రస్తుతం దృష్టిసారిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయాలతో వారానికి విత్ డ్రా చేసే మొత్తం విలువను పెంచటంతో పాటు.. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ద్వారా తీసుకునే క్యాష్ పరిమితిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ బ్యాంకుల్లో రూ.3లక్షల కోట్ల పాత నోట్లు జమ అయ్యాయని.. ఇప్పటివరకూ ప్రజలు వినియోగించిన మొత్తం రూ.50వేల కోట్లకు చేరినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.

చెక్కులు.. డీడీలు.. ఆన్ లైన్ చెల్లింపుల్ని నిరాకరించే సంస్థలపై మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేయొచ్చన్న విషయాన్ని ఆర్థిక శాఖ స్పష్టం చేయటమే కాదు.. దివ్యాంగులు.. వృద్ధులకు బ్యాంకుల్లో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని చెప్పటమేకాదు.. రోగుల కోసం మొబైల్ బ్యాకింగ్ ఏర్పాటు చేయాలన్న సూచనను చేసింది. విత్ డ్రా మొత్తాన్నిపెంచిన వైనానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే..

= వారానికి రూ.20వేలుగా ఉన్న నగదు ఉపసంహరణ పరిమితి రూ.24 వేలకు పెంపు

= రోజుకు రూ.10వేలు మాత్రమే తీసుకోవాలనే నిబంధనను ఎత్తేశారు

= ఏటీఎంలలో రోజుకు రూ.2వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే పరిమితిని రూ.2500లకు పెంచుతూ నిర్ణయం

= నోట్ల మార్పిడి మొత్తాన్ని రూ.4వేల నుంచి రూ.4500లకు పెంపు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/