Begin typing your search above and press return to search.

ఏటీఎం చోరీకేసు: విచారణలో పోలీసులకు షాక్

By:  Tupaki Desk   |   20 Jun 2021 7:25 PM IST
ఏటీఎం చోరీకేసు: విచారణలో పోలీసులకు షాక్
X
ఏపీలోని పెనమలూరు ఏటీఎం చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇది చూసి పోలీసులే షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. సీసీటీవీ ఆధారంగా బెజవాడ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఐదు హత్యలు, 10 చైన్ స్నాచింగ్ లు, ఐదు చోరీలు చేశారు. కానీ దొరికింది మాత్రం ఏటీ ఎం దొంగతనం కేసులో కావడం విశేషం. పట్టుబడిన దొంగలను విచారించగా నరహంతకులు అని తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ఏకంగా ఐదు హత్యలతో తమకు సంబంధం ఉందని.. 10 చైన్ స్నాచింగ్ లు, 5 చోరీలు చేసినట్టు ఒప్పుకున్నారు పట్టుబడ్డ నిందితులు.

యూట్యూబ్ నేర కథనాల ద్వారా పథకాలు రచిస్తున్నట్టు తేల్చారు. ఒంటరి మహిళలు, వృద్ధులే టార్గెట్ గా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ముఠా సభ్యులను రిమాండ్ కు తరలించారు.

పెనమలూరులో ఏటీఎం దొంగతనం చేసి పట్టుబడిన నిందితుల వేలిముద్రల ఆధారంగా కంచికచర్లలో వృద్ధ దంపతులను వారే హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. గతఏడాది కంచికచర్లలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల కేసులో చిక్కుముడి వీడింది.

వృద్ధ దంపతుల ఇంటి వెనుక ఉన్న మెస్ డోర్ తెరిచినప్పుడు వేలిముద్రలు చిక్కాయి. తాజాగా పెనమలూరులోని ఏటీఎంలోని చోరీకి పాల్పడిన వారి వేలిముద్రల ఆధారంగా వారే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.