Begin typing your search above and press return to search.
ఏటీఎంలో డబ్బులు లేవా? బ్యాంకులకు ఫైన్.. కామెడీ కాదు నిజంగానే
By: Tupaki Desk | 11 Aug 2021 7:28 AM ISTఈ మధ్యన వచ్చిన ఒక సినిమాలో.. చెక్కు ఇచ్చిన తర్వాత అకౌంట్లో డబ్బులు లేవంటే సిబిల్ స్కోర్ తగ్గించటం.. ఫైన్ వేయటం లాంటివి చేస్తారు. మరి.. బ్యాంకు ఖాతాలో దాచుకున్న డబ్బుల్ని తీసుకోవటానికి ఏటీఎంలకు వెళితే.. డబ్బుల్లేవని వెక్కిరిస్తే ఎలా ఊరుకోవాలి? ఆ బ్యాంకులకు ఫైన్ వద్దా? అన్న ప్రశ్నను సంధించారు. రీల్ లో కనిపించిన ఈ సీన్ చూసినోళ్లలో చాలామంది నవ్వుకుంటే.. మరికొందరిలో మాత్రం ఆలోచనలు మొదలయ్యాయి.
నిజమే కదా..ఒక నెలలో బ్యాంకులు నిర్దేశించిన దాని కంటే ఎక్కువ సార్లు ఏటీఎంను వినియోగిస్తే.. అదనపు చార్జీలు వేసే బ్యాంకులు.. వినియోగదారుడు ఏటీఎంలకు వెళ్లినప్పుడు డబ్బులు అందుబాటులో ఉండేలా చూడాలి కదా? ఒకవేళ అలా లేని పక్షంలో సేవల్లో అంతరాయం కలిగించినట్లే కదా? ఈ ఆలోచన వినేందుకు బాగానే ఉన్నా.. ఇలాంటి వాటిని నిబంధనలుగా మార్చటానికి వ్యవస్థలు సిద్ధంగా ఉండవన్న ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆ కొరతను తీర్చేలా రిజర్వుబ్యాంక్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి ఏటీఎంలో క్యాష్ లేకుండా ఉన్నట్లైయితే.. సదరు బ్యాంకుకు జరిమానా విధించాలన్న నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సర్క్యులర్ ను తాజాగా విడుదల చేశారు. నెలలో మొత్తం పది గంటల పాటు ఏటీఎంలో నగదు లేని పక్షంలో సదరు బ్యాంకు పై ఆర్ బీఐ జరిమానా విధిస్తుంది. ఇలా క్యాష్ నిండుకొని.. ఖాతాదారులకు చుక్కలు చూపించే ఏటీఎంలున్న బ్యాంకులకు రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తారు.
ఏదైనా ఏటీఎం నుంచి ఖాతాదారుడు క్యాష్ విత్ డ్రా చేయాలని భావించిన వేళ.. అందులో నగదులేని పక్షంలో ఆ సమయం నుంచి క్యాష్ నింపే వరకు పట్టిన సమయాన్ని ‘నో క్యాష్ టైం’గా పరిగణిస్తామని ఆర్ బీఐ వెల్లడించింది. ఏటీఎంలో క్యాష్ లేదని తిట్టుకోవాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉండదన్నమాట. ఎంతకాలానికి ఖాతాదారుడి వైపు నుంచి ఆర్ బీఐ ఆలోచించిందో కదా?