Begin typing your search above and press return to search.

క్రికెటర్ తో పెళ్లి.. స్టార్ హీరో కూతురు సెటైర్

By:  Tupaki Desk   |   13 July 2022 2:54 PM GMT
క్రికెటర్ తో పెళ్లి.. స్టార్ హీరో కూతురు సెటైర్
X
సినిమా ప్రపంచంలో క్రికెటర్లతో హీరోయిన్స్ డేటింగ్ చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలామంది నటీమణులు క్రీడాకారులను పెళ్లాడారు కూడా. ఇక కొందరు చాలా రోజుల వరకు డేటింగ్ చేసి కొన్నాళ్ల అనంతరం బ్రేకప్ కూడా చెప్పేశాడు. అగ్ర క్రికెటర్లు కూడా అప్పట్లో ఇలాంటి వార్తల్లో ఎక్కువగా నిలిచే వారు. ఇక నేటితరం హీరోల్లో కొంతమంది హీరోయిన్స్ కూడా యువ క్రికెటర్లను ఎక్కువగానే ఆకర్షిస్తున్నారు.

ఒక సీనియర్ హీరో కూతురు గత కొన్నేళ్లుగా కెఎల్.రాహుల్ తో ప్రేమలో ఉన్నట్లు కథనాలు అయితే వస్తున్నాయి. ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే టాక్ కూడా వచ్చింది. ఇక ఫైనల్ గా ఆ విషయంలో అమ్మడు క్లారిటీ ఇచ్చింది. టీమిండియా ప్రముఖ క్రికెటర్ కెఎల్.రాహుల్ ఫామ్ లోకి వచ్చిన తరువాత అతని పేరు ఫిల్మ్ మీడియాలో కూడా ఎక్కువగానే వైరల్ అవుతోంది.

మొదట్లో అతను ఒక బాలీవుడ్ యంగ్ బ్యూటీని ప్రేమించి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు గట్టిగానే వచ్చాయి. ఒక గొడవ కారణంగానే వారి బ్రేకప్ చెప్పినట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ఇక కెఎల్.రాహుల్ ఫైనల్ గా ఇటీవల మరొక బ్యూటీతో గాడ ప్రేమలో మునిగిపోయినట్లు కూడా దేశవ్యాప్తంగా ఫిల్మ్ మీడియాలో వార్తలు గట్టిగానే వచ్చాయి. ఆమె మరెవరో కాదు అతియా శెట్టి.

సునీల్ శెట్టి కుమార్తే అయిన అతియా చాలాసార్లు రాహుల్ తో సాన్నిహిత్యంగా కనిపించింది. ఇక రీసెంట్ గా రాహుల్ గాయం కారణంగా సర్జరీ చేయించుకునేందుకు జర్మనీ వెళ్లగా ఈ బ్యూటీ అక్కడికి కూడా వెళ్లింది.

అయితే ఇటీవల ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి అని బాలీవుడ్ లో కథనాలు రాగా ఆ విషయంలో ఈ బ్యూటీ ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. నా పెళ్లికి నన్ను పిలవండి అంటూ సెటైర్ వేసి అందులో నిజం లేదని చెప్పింది. మరోవైపు సునీల్ శెట్టి సైతం అలాంటిదేమి లేదని పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక్క కామెంట్ తో కొట్టి పారేశారు.