Begin typing your search above and press return to search.
అటల్ టన్నెల్.. ప్రత్యర్థులకు హడల్
By: Tupaki Desk | 4 Oct 2020 6:30 PM ISTప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ టన్నెల్ మన సైన్యానికి ఎంతో ఉపయోగపడనుంది. ఈ టన్నెల్ దక్షిణ ముఖద్వారం హిమాచల్ ప్రదేశ్ లో ఉంటే ఉత్తర ముఖద్వారం లడ్డాఖ్ లో ఉంది. 9.02 కిలోమీటర్ల మేర కొండలను తొలిచి ఈ టన్నెల్ ను నిర్మించారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద టన్నెల్. సముద్ర మట్టానికి 10,340 అడుగుల ఎత్తున టన్నెల్ ను నిర్మించారు. బయట గాలి ఎంత వేగంగా ప్రయాణిస్తోంది. ఆక్సీజన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయని టన్నెల్లో ప్రయాణించే వారికి తెలిసేలా ఏర్పాట్లు చేశారు. ఈ టన్నెల్‌ను ఏర్పాటు చేయడం వల్ల సైనికులు తొందరగా తమ గమ్యస్థానాలకు చేరుకొనే అవకాశం దక్కింది. అంతకు ముందు చాలా సమయం తీసుకునేది.
గతంలో రోహ్ తంగ్ పాస్-లడ్డాఖ్-లేహ్ మధ్య ప్రయాణించాలంటే సుమారు ఏడుగంటలు పట్టేది.
అది కూడా కొండలు, నదులు దాటుకుంటా చాలా ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ టన్నెల్ నిర్మాణంతో ఆ బాధలు తప్పనున్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో టన్నెల్ ను నిర్మించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) నిపుణులు దీని నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
రోహ్ తంగ్ పాస్-లడ్డాఖ్-లేహ్ మధ్య ప్రయాణం ఎంతో ప్రయాసతో కూడుకున్నది. కేవలం వేసవిలోనే ఇక్కడ ప్రయాణం సాధ్యమయ్యేది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడి ఎంతోమంది మరణించేవారు కూడా.. ఇక శీతాకాలంలో ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకున్నది. వృద్ధులు, పిల్లలు ఈ దారిలో ఏనాడు వెళ్లలేరు. అయితే ప్రస్తుత టన్నెల్ నిర్మాణంతో ఆ కష్టాలకు చెక్‌పడింది.
వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ టన్నెల్ నిర్మాణాన్ని చేపట్టారు. కానీ అతర్వాత వచ్చిన యూపీఏ హయాంలో పనులు మందకొడిగా సాగాయి. మోదీ ప్రధాని అయ్యాక పనుల్లో వేగం పెంచారు. విదేశీ టెక్నాలజీ సాయంతో పనులను పరుగులు పెట్టించారు.