Begin typing your search above and press return to search.

వాజ‌పేయి స్మార‌కం కోసం ఎక‌రం స్థలం: కేసీఆర్

By:  Tupaki Desk   |   29 Sep 2018 5:53 PM GMT
వాజ‌పేయి స్మార‌కం కోసం ఎక‌రం స్థలం: కేసీఆర్
X
దివంగ‌త మాజీ ప్రధానమంత్రి వాజపేయి స్మారక కేంద్రాన్ని - విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నాయ‌కుడు వాజ్ పేయికి స‌ముచిత గౌర‌వ‌మివ్వాల‌ని వారు కోరారు. దీని పై - సానుకూలంగా స్పందించిన తెలంగాణ ఆప‌ద్ధ‌మ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ....వాజపేయి స్మారక కేంద్రం - విగ్రహం కోసం ఎకరం స్థలం కేటాయించారు. గురువారంనాడు శాసనమండలి సమావేశానికి హాజరైన కేసీఆర్....ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శాస‌న మండలిలో దివంగత వాజపేయికి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. వాజ‌పేయి చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. వాజపేయితో పాటు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి - లోక్‌ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ - మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ ల‌ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి మృతికి సంతాపం ప్రకటిస్తూ కేసీఆర్ వేర్వేరుగా తీర్మానాలు ప్రవేశపెట్టారు.

దేశ ప్రధానుల్లో వాజపేయి విలక్షణమైన నేత అని - చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాల ప్రకారం ముందుకు సాగిన వ్య‌క్తి వాజ‌పేయి అని కేసీఆర్ కొనియాడారు. దేశ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం వాజ‌పేయి త‌న జీవితాన్ని ధార‌బోశార‌ని ప్ర‌శంసించారు. భార‌త రాజ‌కీయాల‌పై వాజ‌పేయి త‌న‌దైన ముద్ర వేశార‌ని అన్నారు. వాజ‌పేయి అనేక గొప్ప సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టార‌ని - దేశ భ‌ద్ర‌త - ర‌క్ష‌ణ కోసం ఫోఖ్రాన్ వంటి ప‌రీక్ష‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించార‌ని అన్నారు. కార్గిల్ యుద్ధం సమయంలో వాజపేయి ధీశాలిగా నిలబడ్డారని కొనియాడారు. అటువంటి మ‌హ‌నీయుడికి నివాళి అర్పిస్తూ....వాజపేయి స్మారకార్థం.. ఎకరం స్థలం కేటాయించాలని, విగ్రహం నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌ని కేసీఆర్ తెలిపారు. ఈ ప్ర‌కారం...ఆ ఎకరం స్థ‌లాన్ని గుర్తించాల‌ని అధికారుల‌ను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌ లో వాజపేయి స్మారక కేంద్రం - విగ్రహం ఏర్పా టు నిర్ణయంపై శాస‌న మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ - బీజేఎల్పీ నేత రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు.