Begin typing your search above and press return to search.
రాత్రి వేళ.. ఫోన్లు చేసి అభ్యర్థులకు ఖరారు చేసిన గులాబీ పార్టీల
By: Tupaki Desk | 20 Nov 2020 1:20 PM ISTఆటకు ఎప్పుడో రెఢీ అయినా.. తమ టీం ఎవరన్న విషయాన్ని బయటకు వెల్లడించేందుకు టీఆర్ఎస్ అధినాయకత్వం అస్సలు ఇష్టపడటం లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ.. మొదటి విడతగా 105 మందికి టికెట్లు కన్ఫర్మ్ చేశాయి. గురువారం మధ్యాహ్నం 20 మందితో రెండో జాబితాను విడుదల చేసిన అధికారపక్షం.. రాత్రి పది గంటల వేళలో..పలువురు పెండింగ్ అభ్యర్థులకు ఫోన్లు చేసి.. టికెట్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అయోమయం నెలకొంది.
మొత్తం 150స్థానాలకు ఇప్పటివరకు అధికారికంగా 125 డివిజన్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది టీఆర్ఎస్. మిగిలిన 25 డివిజన్లలో అత్యధికం బీజేపీ ముఖ్యనేతలు ఉన్నవే కావటం గమనార్హం. దీంతో.. అభ్యర్థుల్ని ఖరారు చేయకపోవటం వెనుక ప్రత్యేకమైన వ్యూహం ఏమైనా ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. మిగిలిన అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో ముందుంటే.. తమ పరిస్థితి త్రిశంక స్వర్గంగా మారిందంటున్నారు.
టికెట్ ఇస్తారో ఇవ్వరో అర్థం కావటం లేదని.. ఒకవేళ ఇవ్వకుంటే వేరే పార్టీలోకి వెళ్లకుండా ఉండేలా టీఆర్ఎస్ అధినాయకత్వం ప్లానింగ్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. పెండింగ్ లో ఉన్న కొందరికి టీఆర్ఎస్ ముఖ్యనేతల నుంచి ఫోన్లు వచ్చాయని.. నామినేషన్లు దాఖలు చేసుకోవాలని.. బీఫారాలు తర్వాత ఇస్తామని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. గురువారం రాత్రి వేళలో కొందరికి ఫోన్లు రావటంతో మిగిలిన వారు అలెర్టు అయిపోయారు. దీంతో.. ఎవరికి వారు ఫోన్లు చేసుకొని.. మీకు ఫోన్ వచ్చిందా? టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా? అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోవటం కనిపించింది. మొత్తంగా టికెట్లు ఫైనల్ చేయకుండా పెండింగ్ పెట్టిన అభ్యర్థులంతా ఇప్పుడు పరేషాన్ అవుతున్న పరిస్థితి.