Begin typing your search above and press return to search.
డిసెంబరు 31 అర్థరాత్రి వేళ.. ఇనుపరాడ్లతో జూబ్లీహిల్స్ లో హల్ చల్
By: Tupaki Desk | 1 Jan 2021 4:24 PM ISTకొత్త సంవత్సరానికి స్వాగతం పలికే హడావుడిలో కొందరు.. జోష్ లో మరికొందరు మునిగిన వేళ.. అసాంఘిక శక్తులు.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు కొందరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సంపన్నులు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత కొందరు చేసిన హడావుడి అంతా ఇంతా కాదని చెబుతున్నారు.
కొత్త సంవత్సర వేడుకల్లో అర్థరాత్రి వరకు పూటుగా తాగిన ఒక గ్రూపు.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని చెబుతున్నారు. వారిలో వారే ఘర్షణ పడుతూ.. కొట్టుకున్న వారు.. పనిలో పనిగా ఆ రోడ్డు మీదుగా వెళ్లిన వారిపై కర్రలతో.. ఇనుప రాడ్లతో దాడి చేయటం సంచలనంగా మారింది. దాదాపు పది మందికిపైనే యువకులు చేతిలో రాడ్లు పట్టుకొని హల్ చల్ చేసినట్లుగా చెబుతున్నారు.
దీంతో.. వీరి ఆరాచకాన్ని తట్టుకోని వారు కొందరు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో.. హుటాహుటిన రోడ్డు నెంబరు 45కు పోలీసులు చేరుకున్నారు. సీసీ కెమేరాలు.. ఇతర ఆధారాలతో హల్ చేసిన ఆ గ్యాంగ్ ఎవరు? అన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.