Begin typing your search above and press return to search.
ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పేస్తున్న జ్యోతిష్యులు
By: Tupaki Desk | 15 April 2020 9:30 AM ISTకరోనా పిశాచి మానవాళిని ఎప్పుడు వదిలిపెడుతుందన్నది ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. కొమ్ములు తిరిగి శాస్త్రవేత్తలు సైతం భవిష్యత్తు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేకపోతున్నారు. అంతులేని అనిశ్చిత చుట్టూ పరుచుకున్న వేళ.. రేపటి సంగతిని తాము ఇప్పట్లో చెప్పలేమని తేల్చేస్తున్నారు. అందుకు భిన్నంగా జ్యోతిష్యులు మాత్రం భవిష్యత్తు ఎలా ఉంటుందో రంగుల సినిమాను చూపించేస్తున్నారు.
తాము ఉత్తగా ఈ మాటల్ని చెప్పట్లేదని.. బలమైన కారణాలు ఉన్నట్లుగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రహాల కదలికల ఆధారంగానే భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని చెబుతున్నట్లుగా వారు వాదనను వినిపిస్తున్నారు. ఇంతకూ జ్యోతిష్య పండితులు చెప్పేదేమిటన్నది చూస్తే.. మే నుంచి అన్ని శుభాలే అని వారు చెబుతున్నారు.
2019 డిసెంబరు లో సూర్యుడు.. చంద్రుడు.. బుధ.. గురు.. శని.. కేతువులు ధనస్సు రాశిలో ఉన్నారని.. ఆ గ్రహాన్ని రాహువు చూస్తున్నాడని చెప్పారు. దీంతో పాటు మకరరాశిలో శని.. కుజ.. గురువులు కలిసిపోవటం వల్లనే ఇంతకు ముందెప్పుడూ చూడని దారుణ పరిస్థితులు ఏర్పడినట్లుగా వారు చెబుతున్నారు. గురు గ్రహం మంచిదే అయినా మార్చి 30 నుంచి జూన్ 30 వరకు మకరరాశిలో ఉంటుందని.. అది గురు గ్రహానికి మంచిది కాదంటున్నారు.
శని.. గురు గ్రహాలు కలయిక తర్వాత ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకొని లాక్ డౌన్ ను ప్రకటించాయని గుర్తు చేస్తున్నారు. ప్లూటో గ్రహాన్ని యమునితో పోలుస్తారు. ఆ గ్రహం శనితో కలవటంతో ఇప్పుడున్న విపత్కర పరిస్థితి ఎదురైనట్లు చెబుతున్నారు. గతంలోనే ఇలాంటి కాంబినేషన్ల సమయంలోనే రెండు ప్రపంచ యుద్దాలు జరిగినట్లుగా విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత 1982లోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడినప్పుడే.. ఎయిడ్స్ వచ్చిందని చెప్పారు. తాజాగా 2019 డిసెంబరులో ఈ రెండు గ్రహాలు దగ్గర కావటంతోనే కరోనా వచ్చినట్లుగా వారు విశ్లేషిస్తున్నారు.
జనవరిలో శని.. ఫ్లూటో గ్రహాలతో పాటు.. సూర్యుడు కూడా మకర రాశిలోకి రావటంతో వైరస్ తీవ్రత పెరిగినట్లుగా చెబుతున్నారు. మార్చి 31న గురు గ్రహం శనితో కలిసిందని.. అందువల్లే మరణాలు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో శని.. గురువు క్రమంగా దూరం అవుతారని.. వారు దూరం అయ్యే కొద్ది వైరస్ తగ్గుదల స్టార్ట్ అయినట్్లుగా చెబుతుున్నారు. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి వెళ్లిపోవటంతో ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని.. మే నాటికి అంతా సెట్ కావటమే కాదు.. పరిస్థితులు మెరుగు అవుతాయన్న ఆశభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాదనను మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అన్న ప్రశ్న వేసేవారు నమ్మనమ్మని.. ఎవరి నమ్మకాలు వారివి అంటూ ఫ్యూచర్ మీద కొత్త కలలు కంటూ మే కోసం ఎదురు చూస్తున్నారు పలువురు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాజిటివ్ అటిట్యూడ్ మినహా మరో మార్గం లేదన్నది మర్చిపోకూడదు.