Begin typing your search above and press return to search.

ఆస్ట‌రాయిడ్ వ‌స్తోంది...అమెరికా ఎన్నిక‌లో గెలుపు ఆయ‌న‌దే?!

By:  Tupaki Desk   |   25 Aug 2020 5:30 PM GMT
ఆస్ట‌రాయిడ్ వ‌స్తోంది...అమెరికా ఎన్నిక‌లో గెలుపు ఆయ‌న‌దే?!
X
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 8 న జరుగనున్నాయి. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ పేరును రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ తాజాగా అధికారికంగా నామినేట్ చేసింది. డెమోక్రాటిక్ పార్టీ త‌మ అభ్యర్థిగా జో బిడెన్‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ ఇద్ద‌రు నేత‌లు ప్ర‌చారంలో దూసుకుపోతున్న త‌రుణంలో గ్ర‌హ‌శ‌క‌లం రూపంలో ఓ సెంటిమెంట్ స‌ద‌రు నేత‌ల‌ను ట‌చ్ చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒకరోజు ముందు భూమిని ఓ ఆస్ట్రాయిడ్‌ ఢీకొట్టబోతోందని నాసా ప్రకటించడంతో కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది.

2018VP1 అనే పేరుగ‌ల ఈ గ్రహశకలం నవంబర్ 2న భూమికి అత్యంత దగ్గరగా అంటే.. 482 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని కాలిఫోర్నియాలోని పల్మొనార్ అబ్జర్వేటరీలో 2018లో నాసా గుర్తించింది. వచ్చే నవంబర్‌లో భూమిని తాకబోతోందని అంచ‌నాల‌తో ప్ర‌జ‌ల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాసా శాస్ర్తవేత్తల అంచనా నిజ‌మైతే భూమికి ఎలాంటి హానీ జరగదు. కానీ ఒకవేళ గ్రహశకలం భూమిని తాకితే ప్రళయమే జరిగే ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

నవంబర్‌ 2న భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న ఆస్ట్రాయిడ్‌ భారీ నష్టాన్ని మిగుల్చుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే, శాస్త్రవేత్త‌ల‌ లెక్క తప్పి గ్రహశకలం ఢీకొడితే… అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 3కి ముందురోజే ప్రళయం సంభవించే ప్రమాదం ఉంది. 2018 VP1 అంతరిక్షంలో ఒంటరిగా లేదు. ఈ రకమైనవి వందల మిలియన్ల ఉన్నాయి. నష్టం కలిగించే అవకాశం లేదని చెబుతున్నారు. 2016లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలోనూ ఓ ఆస్టరాయిడ్ ఇలాగే భూమి పక్క నుంచి దూసుకెళ్లింది. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలిచిన నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌నే గెలిచే చాన్స్ ఉంద‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా, మొత్తం 50 రాష్ట్రాల నుంచి ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల నుంచి అందిన ఓట్ల జాబితా మేరకు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా నామినేట్ అయ్యారు. ఈ నెల 27 న వైట్ హౌస్ సౌత్ లాన్ నుంచి తన అంగీకార ప్రసంగాన్ని చేయనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నాలుగేళ్ల‌లో ఒకసారి గ్రాండ్ ఓల్డ్ పార్టీ సమావేశం వర్చువల్ మోడ్‌లో జరుగుతుంది. ఈసారి ఉత్తర కరోలినాలోని షార్లెట్‌లో జరుగనుంది.