Begin typing your search above and press return to search.

ఆకాశంలో మరో అద్భుతం ..ఆకుపచ్చ అగ్నిగోళం ..దేనికి సంకేతం ?

By:  Tupaki Desk   |   17 Jun 2020 11:11 AM GMT
ఆకాశంలో మరో అద్భుతం ..ఆకుపచ్చ అగ్నిగోళం ..దేనికి సంకేతం ?
X
ఈ సువిశాలమైన విశ్వంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఎదో ఒక వింత చోటు చేసుకుంటూనే ఉంటుంది. రోజు కనీసం వంద టన్నుల దుమ్ము ధూళితో కూడిన పదార్ధాలు, రాళ్ళు , ఉల్కలు, తోకచుక్కలు, గ్రహశకలాలు భూమిపై పడుతూ ఉడటం, భూమి పక్క నుంచి వెళ్తూ ఉడటం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అంతరిక్షం నుంచి వచ్చే గ్రహశకలాలు భూమిని డీకొడుతుంటాయి.

అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియాలోని పిల్‌ బారాలో పడిన అగ్నిగోళం,. ఆకుపచ్చ లో ఉండటం అందరనీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా అగ్నిగోళాలు ఎర్రటి మంటతో దాదాపు తెలుపు, పసుపు రంగులో కనిపిస్తాయి. మరి ఇది గ్రీన్‌గా ఎందుకుంది అని ప్రజలు చర్చించుకున్నారు. వావ్.. వాటే కలర్ అంటూ దాన్ని వీడియో తీశారు. ఈ విషయం ఇప్పుడు యూఫాలజిస్టుల చేతిలోకి వెళ్లింది. ఏప్రిల్‌ లో అమెరికా రక్షణ విభాగం పెంటగాన్... UFO లు ఉన్నాయంటూ వీడియోలు రిలీజ్ చేయడంతో ఆస్ట్రేలియాలో పడిన అగ్నిగోళానికీ, ఏలియన్స్‌కీ లింక్ పెడుతున్నారు యూఫాలజిస్టులు.

మామూలుగా అయితే దీని గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, ఆకుపచ్చ రంగులో ఉండటంతో ఎందుకు ఆ కలర్ లో ఉన్నది అనే విషయంపై పెద్ద ఎత్తున పరిశోధన చేస్తున్నారు యూఫాలజిస్టులు. గతంలో ఫ్లయింగ్ సాసర్స్ లేవని కొట్టిపారేసిన అమెరికా, వాటి గురించిన కథనాన్ని, ఫ్లయింగ్ సాసర్స్ వీడియోను రిలీజ్ చేసిన తరువాత మరింత క్యూరియాసిటీ పెరిగింది.

ఆస్ట్రేలియాలో పడినది ఎక్కడ పడిందో ఇంకా తెలియలేదు. అది నాసా ఇటీవల పంపిన రాకెట్ తాలూకు, శకలం కావచ్చని కొందరు అనగా అది UFO కాకపోవచ్చని మరికొందరు అన్నారు. కొంతమంది దానిని ఎలియన్స్ అంటున్నారు.. మరికొంతమంది మాత్రం అందులో సల్ఫర్ వంటి మూలకాలు ఉన్నాయని, అందుకే అది ఆకుపచ్చ రంగులో మండుతున్నదని చెప్తున్నారు. ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.