Begin typing your search above and press return to search.

సైనికుల్ని కొట్టేసినోళ్ల‌ను జీపున‌కు క‌ట్టేస్తే త‌ప్పా?

By:  Tupaki Desk   |   16 April 2017 4:54 AM GMT
సైనికుల్ని కొట్టేసినోళ్ల‌ను జీపున‌కు క‌ట్టేస్తే త‌ప్పా?
X
కోపం ఎంతైనా ఉండొచ్చు. అలా అని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. వ్య‌వ‌స్థ‌ల మీద దాడి చేయ‌టం స‌రైన చ‌ర్యేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. శ్రీన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా చెల‌రేగిన హింస కార‌ణంగా.. వాటిని అడ్డుకునేందుకు.. హింస‌కు చెక్ పెట్టేందుకు కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న‌లో ప‌లువురు మ‌ర‌ణించారు. దీనికి ప్ర‌తీకారం అన్న‌ట్లు.. సైనికుల్ని తిడుతూ.. కొట్టిన వైనంతో పాటు.. భార‌త వ్య‌తిరేక నినాదాలు చేయించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

క‌శ్మీర్ లోయ‌లో ఎలాంటి ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యానికి తాజా వీడియో నిలువెత్తునిదర్శనంగా చెప్పక‌ త‌ప్ప‌దు. ఇలాంటి వాటిపై తీవ్రంగా రియాక్ట్ కావాల్సి ఉన్నా.. కానోళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తారు. ఇదిలా ఉండ‌గా.. సైనికులపై దాడికి కౌంట‌ర్ అన్న‌ట్లుగా.. తాజాగా మ‌రో వీడియో రిలీజ్ అయ్యింది. ఇందులో రాళ్లేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే ముగ్గురు యువ‌కుల చేత ఓ సైనికుడు ఒక‌రు నేల మీద ప‌డేసి కొడుతున్న వీడియోతో పాటు.. సైనిక వాహ‌నంలో బందీలుగా ఉన్న ముగ్గురుయువ‌కుల చేత ఒక సైనికుడు బ‌ల‌వంతంగా పాక్ వ్య‌తిరేక నినాదాలు చేయించిన వీడియో క‌ల‌క‌లం రేపింది. ఈ వీడియోల్ని ఖండిస్తూ.. సోష‌ల్ మీడియాలో నిర‌స‌న‌లు వినిపిస్తుండం గ‌మ‌నార్హం.

ఓప‌క్క సైనికుల్ని అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో తిట్టి.. కొట్టి.. వారి చేత బార‌త్ వ్య‌తిరేక నినాదాలు చేయించిన కొంద‌రు క‌శ్మీరీల తీరును పెద్ద‌గా గ‌ర్హించ‌కున్నా.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారి మీద సైనికులు త‌మ‌దైన శైలిలో చేసిన యాక్ష‌న్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టం విశేషంగా చెప్పాలి. సోష‌ల్ మీడియాలో కొంద‌రి రియాక్ష‌న్ ఎలా ఉందంటే.. భావోద్వేగంతో ఏం చేసినా చెల్లిపోతుంద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం బాగోలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిజానికి క‌శ్మీర్‌ లో సైనికుల విష‌యంలో అక్క‌డి వారు ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

అయితే.. అలాంటి వీడియోలు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావు. అదే స‌మ‌యంలో సైనికుల్ని బ‌ద్నాం చేసేలా.. వారి వాద‌న‌లు నీరుగార్చేలా.. వారి చ‌ర్య‌ల్ని భూత‌ద్దంలో పెట్టి చూపించేలా వీడియోల్ని పోస్ట్ చేయ‌టం ఈమ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది. చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోవ‌టం.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారి విష‌యంలో కాస్తంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌టం త‌ప్పేం కాద‌ని చెప్పాలి.

అంద‌రికి హెచ్చ‌రిక‌గా ఉండేలా చేసే చ‌ర్య‌ల విష‌యంలో క‌ఠినంగా ఉండాల్సిందే. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే యువ‌కుల్ని క‌ఠినంగా శిక్షించాల్సిన అవ‌స‌రం ఉంది. దాన్ని వెన‌కేసుకొస్తే.. మొద‌టికేమోసం వ‌స్తుంద‌న్న విష‌యాన్ని గుర్తించాలి. చ‌ట్టాన్ని ఇష్టారాజ్యంగా చేతుల్లోకి సైనికులు తీసుకుంటే.. ఈ రోజు దేశంలో ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. అలా కాకుండా సంయ‌మ‌నం కోల్పోకుండా స‌హ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. కొన్ని సంద‌ర్బాల్లో చోటు చేసుకునే అతిని అడ్డుక‌ట్ట వేసేందుకు చేసే చ‌ర్య‌ల్ని భూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/