Begin typing your search above and press return to search.

నెల్లూరులో ప్రముఖ న్యాయవాదిపై హత్యాయత్నం

By:  Tupaki Desk   |   19 Feb 2021 3:20 PM IST
నెల్లూరులో ప్రముఖ న్యాయవాదిపై హత్యాయత్నం
X
తెలంగాణలో ఇద్దరు న్యాయవాద దంపతుల హత్య మరువక ముందే ఏపీలో మరో దారుణం జరిగింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ప్రముఖ న్యాయవాది కొండ రమేశ్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. పట్టపగలు ఆయన ఇంట్లోకి వెళ్లి మరీ దాడి చేసి రమేశ్ ను హత్య చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఏపీలో కూడా తెలంగాణలో లాగా దాడి జరగడం ఇప్పుడు న్యాయవాద వర్గాలను షాక్ కు గురిచేస్తోంది.

నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడైన న్యాయవాది కొండ రమేశ్ పై గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటికి వెళ్లి మరీ దాడికి దిగారు. అయితే దుండగుల నుంచి న్యాయవాది తప్పించుకొని తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. రమేశ్ ను స్థానికులు నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

కాగా న్యాయవాది కొండ రమేశ్ కు, అతడి అన్నాదమ్ములకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కొండా రమేశ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రౌడీలు తనపై దాడి చేశారని.. ఆస్తి వివాదాన్ని సెటిల్ చేసుకోకుంటే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశఆడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.