Begin typing your search above and press return to search.

ప్లాస్మా దాతలకు ప్రభుత్వం బిగ్ ఆఫర్

By:  Tupaki Desk   |   17 July 2020 3:30 PM GMT
ప్లాస్మా దాతలకు ప్రభుత్వం బిగ్ ఆఫర్
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని కోట్లు ఉన్నాయన్నది ముఖ్యం కాదు.. ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నదే ముఖ్యం.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు వందల కోట్లు ఉన్నా ఆయనను మందు లేని కరోనా నుంచి కాపాడేది కేవలం ప్లాస్మా మాత్రమే. లేదంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకే ఇప్పుడు కరోనా చికిత్సలో ఆ వ్యాధిని జయించిన రోగులు ప్లాస్మా దానంలో కీలకంగా మారింది.

కరోనా నుంచి ప్రాణాలను కాపాడటంలో ప్లాస్మా చికిత్స ఎంతగానో ఉపయోగపడుతోంది. దేశ రాజధాని ధిల్లీలో ప్లాస్మా చికిత్స ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.

ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించడానికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్లాస్మా దాతలకు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత భిశ్వా మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న యువకుల్లో ఇద్దరికీ ఒకే మార్కులు వస్తే.. మొదటగా ప్లాస్మా దాతకే ప్రాధాన్యత ఇస్తామని అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. అంతేకాకుండా ఇంటర్వ్యూల్లో వారికి రెండు మార్కులు అదనంగా కలుపుతామని ప్రకటించారు. ప్లాస్మాను దానం చేసేవారికి ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తామన్నారు. దీంతో అక్కడి కరోనా సోకి కోలుకున్న నిరుద్యోగులు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.