Begin typing your search above and press return to search.
కరోనా మరణాలను తగ్గిస్తున్న ‘ఆస్పిరిన్’.. పరిశోధనలో షాకింగ్ నిజాలు
By: Tupaki Desk | 28 Oct 2020 4:00 PM ISTగుండెపోటు, చాతినొప్పితో బాధపడే వారికి అందించే చికిత్సలో వాడే ఆస్పిరన్ మందు ఇప్పుడు కరోనా మరణాలను గణనీయంగా తగ్గిస్తుందట. ఆస్పిరిన్ వేసుకుంటే 47 శాతం కరోనా మరణాలను తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అస్పిరిన్ వాడితో కరోనా బాధితుల్లో ఐసీయూ లేదా వెంటిలేటర్లపై చేరేందుకు 40 శాతం కంటే చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మారీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (యూఎంఎస్వోఎమ్) నిపుణులు 412 మందిపై అధ్యయనం చేశారు. వారి వైద్య రిపోర్టులను పరిశీలించారు. ఈ అధ్యయనానికి సంబంధించి ఫలితాలను అనస్థీషియా మరియు అనాల్జేసియా జనరల్ లో ప్రచురించారు. కరోనా బాధితులకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ ఇవ్వడం వల్ల వారిలో వ్యాధి తీవ్రత తగ్గినట్టు గుర్తించారు.
ఆస్పత్రుల్లో చేరిన కరోనా పేషెంట్లో అస్పిరిన్ తీసుకోనివారితో పోలిస్తే.. అస్పిరిన్ తీసుకున్నవారు చనిపోవడానికి 47 శాతం తక్కువ అవకాశాలు ఉన్నాయని యూఎంఎస్వోఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జోన్తాన్ చౌ నేతృత్వంలోని నిపుణుల బృందం వెల్లడించింది. అంతేకాదు.. మెకానికల్ వెంటిలేటర్ పై చేరే ముప్పు 44 శాతం పేషెంట్లలో తక్కువగా ఉంటుందని తేల్చారు. అయితే ఈ అధ్యయాన్ని సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉన్నదని.. ఆ తర్వాత నిర్ధారించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఆస్పిరిన్ ఇవ్వడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. కరోనా వ్యాధి తీవ్రత, వ్యాధి ప్రభావంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీంతో రోజుకో కొత్త అధ్యయనం బయటపడుతోంది.