Begin typing your search above and press return to search.
మంత్రి అనుచరుల పేకాటపై ఏఎస్పీ స్పందన
By: Tupaki Desk | 28 Aug 2020 11:45 AM ISTకర్నూలు జిల్లా గుమ్మనూరులో పలువురు పేకాట రాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే పట్టుబడిన వారు ఏపీ మంత్రి జయరాం అనుచరులం అంటూ పోలీసులకు చెప్పడం చర్చనీయాంశమైంది. పోలీసులు రంగప్రవేశం చేసే సరికి కారం పొడితో పోలీసులపైనే తిరగబడడం సంచలనమైంది.
ఇక ఈ ఘటనలో పట్టుబడ్డ పేకాట రాయుళ్లను వదిలిపెట్టాలని పోలీసులపై కొందరు పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలపై ఏఎస్సీ గౌతమి సాలి మీడియాతో మాట్లాడారు. గుమ్మనూరులో ఆటోలో వెళ్తున్న పోలీసులను కొందరు అడ్డుకున్నారని.. గ్రామంలోకి వెళ్లనీయలేదని.. దౌర్జన్యం చేశారని ఏఎస్పీ గౌతమి తెలిపారు. పోలీసులను చూసి పేకాట రాయుళ్లు పారిపోయారని.. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. రూ.5.50 లక్షలు, కర్ణాటక మద్యం, 36 కార్లు సీజ్, 33 మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని గౌతమి తెలిపారు. మంత్రి అనుచరులా కాదా అన్న విషయంపై ఆరాతీస్తున్నామని వివరించారు.