Begin typing your search above and press return to search.

ఐటీ మ‌ళ్లీ రెంట్ల‌పై దెబ్బేసింది

By:  Tupaki Desk   |   10 July 2017 3:37 PM GMT
ఐటీ మ‌ళ్లీ రెంట్ల‌పై దెబ్బేసింది
X
అద్దె ఇంటి తిప్పలు భ‌రిస్తున్న‌వారికి ఓ శుభవార్త‌. ఇంటి అద్దెల‌తో నాలుగు రాళ్లు వేన‌కేసుకు వ‌స్తున్న వారికి అదే స‌మ‌యంలో దుర్వార్త‌. మ‌హా న‌గ‌రాల్లో అద్దెలు భారీగా తగ్గ‌నున్న‌ట్లు కీల‌క స‌ర్వే ఒక‌టి వెళ్ల‌డించింది. ఏకంగా 20శాతం వ‌ర‌కు ఈ త‌గ్గుతాయ‌ని ప్ర‌ముఖ‌ ఇండస్ట్రీ బాడీ అసోచామ్ తేల్చిచెప్పింది. దేశీయ సాఫ్ట్‌ వేర్ - సేవల హబ్‌ గా కొనసాగుతున్న ప్రధాన నగరాల్లో ఈ ఎఫెక్ట్ భారీగా ఉంటుంద‌ని జోస్యం చెప్పింది.

ఈ నెల నుంచి ఆరంభం కానున్న వచ్చే మూడేళ్ల‌ కాలంలో ఐటీ రంగంలో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉంటుందన్న అంచనాతో గృహాల అద్దెపై ప్రతికూల ప్రభావం చూపనుంద‌ని అసోచామ్‌ జోస్యం చెప్పింది. అత్య‌ధికంగా 20 శాతానికి పైగా పుణేలో త‌గ్గ‌నున్న‌ట్లు తెలిపింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో 10 నుంచి 15 శాతం అద్దె ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్న‌ట్లు అంచ‌నా వేసింది. దేశరాజధాని ఢిల్లీ పరిసరప్రాంతాల్లో కూడా రెంట్లు 15 శాతం కరెక్షన్‌కు గురవనున్నాయని వెల్లడించింది. ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడుతుండటం, వేతన పెంపు చాలా తక్కువ స్థాయిలో ఉండటంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం మందకొడిగా కొనసాగుతుండటంతో ఇళ్ల‌ అద్దెలు తగ్గడానికి ప్రధాన కారణమని అసోచామ్ విశ్లేషించింది. ప్రస్తుతం అద్దెకు ఉన్నవారు మెరుగైన పరిస్థితులకోసం వేచి చూస్తున్నారని, నెలవారి చెల్లింపులు పెరుగడానికి వారు ఇష్టపడటం లేదని సర్వేలో తెలిపింది.

నెలకు రూ.15 వేల నుంచి ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు అద్దెలు చెల్లిస్తున్న వారిపై అసోచామ్ ఈ సర్వేను నిర్వహించింది. ఉద్యోగ నియామకాల్లో నిస్తేజం ఉన్నప్పటికీ నాలుగు నుంచి ఐదు పెద్ద నగరాల్లో ఐటీ రంగంలో 40 లక్షల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఐటీ - ఆర్థిక సేవల రంగాలు అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నప్పటికీ ఈ రంగానికి చెందిన సిబ్బంది తొందరగా టెంప్ట్ అవుతున్నారని ఆయ‌న విశ్లేషించారు. రెండేళ్ల వ‌ర‌కు ఐటీ రంగం కుదుట‌ప‌డ‌క‌పోవ‌చ్చున‌ని తెలిపారు.