Begin typing your search above and press return to search.

జేసీ త‌న‌యుడి.. ప‌క్కచూపు.. ఫ్యామిలీ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌!!

By:  Tupaki Desk   |   31 Aug 2022 4:46 AM GMT
జేసీ త‌న‌యుడి.. ప‌క్కచూపు.. ఫ్యామిలీ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌!!
X
ఏ మాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. రాజ‌కీయాల్లో ఎవ‌రూ ఎవ‌రికీ శాశ్వ‌త శ‌తృవులు కారు. అదేస‌మ‌యంలో మిత్రులు కూడా కారు. సో.. ఎప్పుడు ఎవ‌రికి ఎలాంటి అవ‌స‌రం ఉంటే.. వారు అలా.. మారిపోవ‌డం.. రాజ‌కీ యాల్లో కామ‌నే. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే.. అనంత‌పురం జిల్లాకు చెందిన తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే ప్ర‌స్తుతం తాడిప‌త్రి.. మునిసిపాలిటి చైర్మ‌న్‌గా ఉన్న జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కుటుం బంలో వైసీపీ ముసలం పుట్టింద‌నే టాక్ వినిపిస్తోంది.

వాస్త‌వానికి జేసీ కుటుంబం అన‌గానే.. ఫైర్ బ్రాండ్స్ అనే ముద్ర ఉంది. గ‌త కాంగ్రెస్ హ‌యాంలో జిల్లా మొత్తంపై ఈ కుటుంబం పైచేయి సాధించింద‌ని అంటారు. ఈ క్ర‌మంలో వైఎస్‌తో అనుకూలంగా ఉంటూ.. పార్టీపైనా.. నాయ‌కుల‌పైనా.. ఏకంగా జిల్లాపైనా.. ఈ కుటుంబం ప‌ట్టు పెంచుకుంది. ఈ క్ర‌మంలోనే తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 35 సంవ‌త్స‌రాల పాటు.. జేసీ కుటుంబం.. ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చిన‌.. జేసీ ఫ్యామిలీ.. తాడిప‌త్రి, అనంత‌పురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకుంది.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో జేసీ దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్‌లు.. పోటీ నుంచి త‌ప్పుకొని.. త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇచ్చా రు. చంద్ర‌బాబు కూడా ఓకేచెప్పారు. అయితే... ప‌వ‌న్‌, అస్మిత్ రెడ్డిలు ఇద్ద‌రూ కూడా.. ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి వారిని వైసీపీ త‌న పార్టీలోకి చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేసింద‌నే వాద‌న ఉంది.

ఇది సాధ్యం కాక‌పోవ‌డంతోనే కేసులు కూడా పెట్టార‌ని.. జేసీ దివాక‌ర్ వ్యాఖ్యానించారు. అయితే. కొన్నాళ్ల కు ఇటు వైసీపీకి.. అటు జేసీ కుటుంబానికి రాజీ కుదిరింద‌ని టాక్ వినిపించింది. అవ‌కాశం ఉన్నా.. వైసీపీ తాడిప‌త్రి మునిసిపాలిటీని జేసీకి వ‌దిలేసింద‌ని చెబుతారు.

ఇక‌, అప్ప‌టి నుంచి వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌ల ప‌ర్వం కూడా త‌గ్గిపోయింది. ఇదిలావుంటే.. గత ఎన్నిక‌ల‌కు ముందే.. అస్మిత్ రెడ్డి వైసీపీ వైపు చూశార‌ని.. జేసీ స్వ‌యంగా చెప్పారు. అయితే..తాము వెళ్ల‌నివ్వ‌లేద‌ని.. అన్నారు. ఇక‌, ఇప్పుడు.. అస్మిత్‌రెడ్డి(ప్రభాక‌ర్ త‌న‌యుడు) వైసీపీకి ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని ..

తాడేప‌ల్లి వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే రెండు ద‌ఫాలుగా కీల‌క నేత‌ల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ని... వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడిప‌త్రి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించింద‌ని అంటున్నారు. కానీ, జేసీ ఫ్యామిలీ దీనికి ఒప్పుకోవ‌డం లేద‌ని.. అంద‌రూ క‌లిసి ఒకే పార్టీలో ఉండాల‌ని భావిస్తోంద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జేసీ కుటుంబ‌రాజ‌కీయం.. ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.