Begin typing your search above and press return to search.

ఆ ప్రశ్న అడిగితే గూగులమ్మే కన్ఫ్యూజన్ కు గురవుతోందట

By:  Tupaki Desk   |   5 Oct 2021 5:38 AM GMT
ఆ ప్రశ్న అడిగితే గూగులమ్మే కన్ఫ్యూజన్ కు గురవుతోందట
X
ఇష్యూ ఏదైనా.. సందేహం ఎలాంటిదైనా సరే.. అడిగినంతనే అంతో ఇంతో సమాధానం ఇచ్చే విషయంలో తోపుగా పేరున్న గూగులమ్మకు పెద్ద కష్టమే వచ్చి పడిందంటున్నారు. ఏదైనా ప్రాంతం గురించి అడిగినంతనే సమాచారంతో పాటు.. ఫోటోలు.. వీడియోల్ని కూడా ఇచ్చేయటం గూగులమ్మకే సాధ్యం. అలాంటి గూగులమ్మకు సైతం కన్ఫ్యూజన్ కు గురయ్యేలా చేయటం ఏపీ సర్కారుకే సాధ్యమన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గూగులమ్మను గందరగోళానికి గురయ్యేలా చేయాలంటే.. ఏపీ రాజధాని ఏమిటి? అని ఈ సెర్చి ఇంజిన్ ను అడిగినంతనే.. నాలుగు రాజధానుల్ని చూపించటం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ రాజధాని? అని సెర్చ్ చేసినంతనే.. అమరావతి.. విశాఖపట్నం.. కర్నూలు.. హైదరాబాద్ అన్న పేర్లను చూపించటం విశేషం. గతంలోఏపీ రాజధాని అని సెర్చ్ చేస్తే.. అమరావతి పేరును మాత్రమే చూపించేది. ఇప్పుడు మాత్రం మూడు రాజధానుల ఎపిసోడ్ వేళ.. నాలుగు ప్లేస్ లను గూగుల్ చూపించటం గమనార్హం. ఇంతకాలం లేని హైదరాబాద్ ను ఏపీ రాజధానిలో ఎందుకు పెట్టినట్లు? అంటే.. అనవసరమైన వివాదాల్లోకి జారిపోకుండా ఉండేందుకే ఈ తరహాలో హైదరాబాద్ పేరును సైతం జత చేశారని చెబుతున్నారు.

మొదట్లో అమరావతి మాత్రమే చూపించే గూగులమ్మ.. ఆ తర్వాత మూడురాజధానులుగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా దీనికి ఆమోద ముద్ర పడనప్పటికీ.. ఏపీ వ్యాప్తంగా మూడు రాజధానుల మాట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది కూడా గూగులమ్మ ఫలితానికికారణంగా చెబుతున్నారు. దీంతోపాటు.. విభజన వేళ.. హైదరాబాద్ తో పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్న ప్రాతిపదికన విభజన చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్ ను కూడా గూగులమ్మ యాడ్ చేసుకుందని చెబుతారు.

మొత్తానికి గూగులమ్మను కూడా కన్ఫ్యూజ్ చేయటంలో ఏపీ సర్కారు సక్సె్ అయ్యిందని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఏపీ రాజధాని అన్నంతనే నాలుగు ప్లేసుల్ని చూపిస్తోంది గూగులమ్మ. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశంలో మూడు రాజధానులు ఉన్న ఏకైక రాష్ట్రమన్న సమాధానాన్ని వికీపీడియా వెల్లడిస్తోంది. దీంతో ఏపీ రాజధానుల గురించి కొత్తగా వెతికే వారికి మాత్రం.. వచ్చే సమాధానాలకు దిమ్మ తిరుగుతోంది.