Begin typing your search above and press return to search.
చివరికి బెడ్ రూంలోనూ అది మా వెంటే.. ఐపీఎల్ పై అశ్విన్
By: Tupaki Desk | 5 Sept 2020 5:00 PM ISTకరోనా కష్టాలు ఐపీఎల్ ఆడగాళ్లను తాకాయి. ఉందో లేదో అనుకున్న ఐపీఎల్ చివరకు ఫిక్స్ అయ్యింది. అయితే ఇప్పుడీ ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లకు కొత్త చిక్కు వచ్చి పడిందట. అదేంటంటే.. కరోనా నుంచి ఆటగాళ్లను రక్షించేందుకు ఆయా జట్ల యాజమాన్యాలు ప్రతి ఐపీఎల్ ప్లేయర్‌కు జియో ట్యాగింగ్ పరికరాన్ని అమర్చారు. ఆటగాళ్లు వేరే వ్యక్తులకు సమీపంలోకి వెళ్లారంటే అలారం మోగుతుంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై వీళ్లను అలర్ట్ చేస్తారు. తాజాగా ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ తన యూ ట్యూట్ చానల్ ద్వారా పంచుకున్నాడు. ఇంతకీ అతడు ఏమంటున్నాడంటే..
‘ఐపీఎల్ 2020 కోసం మేమంతా ప్రస్తుతం దుబాయ్ లో క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము గది దాటామంటే జియో ట్యాగింగ్ పరికరం మా దగ్గర ఉండాల్సిందే. మేము వేరే ఆటగాళ్ల దగ్గరగా వెళ్లగానే అది మమ్మల్ని అలర్ట్ చేస్తోంది. వెంటనే ఆ పరికరం నుంచి ఓ గంట మోగుతుంది. ఇక్కడ మమ్మల్ని అధికారులు కఠిన నిబంధనల మధ్య మమ్మల్ని ఉంచుతున్నారు. అంతకుముందు మాకు దీనిని ఎలా వినియోగించాలి అనే దాని గురించి జూమ్ కాల్‌లో వివరించారు. అప్పుడు ఓ ఆటగాడు ఓ ప్రశ్న అడిగాడు. అక్కడ బయోబుల్ లోకి వచ్చిన మా భార్యలు కూడా ఈ పరికరం వాడాల్సిందేనా.. అని ప్రశ్నించాడు. దానికి అవును అని అధికారులు తెలిపారు. మరి ఆటగాళ్ళం మా భార్యలతో గదిలో కలిసే ఉంటాము కదా! అప్పుడు కూడా ఈ గంట మోగుతుందా అని అన్నాడు. దానికి అందరం నవ్వుకున్నాం.. అంటూ అక్కడి విశేషాలు చెప్పుకొచ్చాడు రవిచంద్రన్.