Begin typing your search above and press return to search.

'అశ్వగంధ' తో కరోనా మహమ్మారి చెక్ !

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:16 PM IST
అశ్వగంధ తో కరోనా మహమ్మారి చెక్ !
X
అశ్వగంధకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంఫ్లమేషన్ ని తగ్గించడం నుంచి, ఒత్తిడి సమస్య వరకూ అశ్వగంధ ఎన్నో విధాలు మేలు చేస్తుంది. ఇండియా, నార్త్ ఆఫ్రికా లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఆయుర్వేదంలో ఇది చాలా ప్రముఖ మూలిక. ఆయుర్వేద వనమూలిక అశ్వగంధ లో కరోనా వైరస్ ను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయా, లేదా ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ యూకెకి చెందిన లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ తో కలిసి పరిశోధనలు జరపనుంది.

దీనితో యూకెలోని మూడు నగరాల్లో దాదాపు 2వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ,ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. కోవిడ్ చికిత్సలో అశ్వగంధ సానుకూల ప్రభావం చూపించగలదని గతంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశోధన కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్-యూకె సిద్ధమవుతున్నాయి. తద్వారా కరోనా వైరస్ చికిత్సలో అశ్వగంధ ప్రభావాన్ని నిర్దారించనున్నాయి.

ఈ క్లినికల్ ట్రయల్స్‌ కు సంబంధించిన ప్రాజెక్టులో కోఇన్వేస్టిగేటర్‌ గా ఉన్న ఆల్ ఇండియా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ తనుజా మనోజ్ మాట్లాడుతూ, క్లినికల్ ట్రయల్స్‌ కోసం ఔత్సాహికులైన 2000 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వీరిని 1000 చొప్పున రెండు గ్రూపులుగా విభిజించనున్నట్లు చెప్పారు. ఇందులో ఒక గ్రూపుకు 3 నెలల పాటు అశ్వగంధ మాత్రలు,మరో గ్రూపుకు ప్లాసిబో ఇస్తారు. ఈ ప్లాసిబో రుచిలోనూ,రూపంలోనూ అచ్చు అశ్వగంధ లాగే ఉంటుంది.

కాబట్టి తేడాను గుర్తుపట్టడం సాధ్యం కాదు. వైద్యులు,పేషెంట్లు ఇరువురికీ అశ్వగంధ,ప్లాసిబోల్లో, ఏది ఇస్తున్నారో తెలియదు. క్లినికల్ ట్రయల్స్‌ లో భాగంగా ఒక గ్రూపుకు రోజుకు రెండు చొప్పున 3 నెలల పాటు 500ఎంజీ అశ్వగంధ ట్యాబెట్లను ఇస్తారు. ఆ పీరియడ్‌ లో వారి యాక్టివిటీస్,మానసిక,శారీరక స్థితి, సప్లిమెంట్ ఉపయోగం,ప్రతికూలతలు తదితర అంశాలను పరిశోధిస్తారు. ఈ పరిశోధన మొత్తం పూర్తవడానికి దాదాపు 16 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌ సక్సెస్ అయితే ఇన్ఫెక్షన్లను నిర్మూలించడంలో అశ్వగంధ సమర్థవంతంగా పనిచేయగలదని నిరూపించినట్లవుతుంది.

అశ్వగంధ ఆరోగ్య ప్రయోజనాలేంటి?

1. ఒత్తిడి తగ్గిస్తుంది

ఈ మూలిక ఒత్తిడినీ, ఆందోళననీ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. ఈ విషయం కొన్ని కంట్రోల్డ్ క్లినికల్ ట్రైల్స్ ద్వారా కూడా నిరూపితమైంది.

2. ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది

అశ్వగంధలో ఉన్న యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాల వల్ల ఈ మూలిక ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. పైగా ఈ మూలిక శరీరంలో ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడే ఇమ్యూన్ సెల్స్ ని ప్రమోట్ చేస్తుంది.

3. బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది

అశ్వగంధ ఇన్సులిన్ సెన్సిటివిటీ ని అభివృద్ధి చేసి ఇన్సులిన్ విడుదలని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పైగా ఈ మూలిక డయబెటిస్ పేషెంట్స్‌లోనే కాదు, మామూలు వాళ్ళలో కూడ బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది.

4. గుండె ఆరోగ్యానికి మంచిది

కొలెస్ట్రాల్‌ని, బ్లడ్ ప్రెజర్ నీ తగ్గించడం ద్వారా అశ్వగంధ గుండెకి మేలు చేస్తుంది. జంతువుల మీద చేసిన పరిశోధనల్లో ఈ మూలిక టోటల్ కొలెస్ట్రాల్ నీ ట్రైగ్లిసరైడ్స్ నీ గణనీయంగా తగ్గిస్తుందని తెలిసింది. హై ట్రైగ్లిసరైడ్స్ హార్ట్ డిసీజెస్ కీ స్ట్రోక్ కీ కారణమవుతాయి.

5. కాన్సర్ తో పోరాడుతుంది

అశ్వగంధ కొన్ని రకాల కాన్సర్లు రాకుండా చేస్తుంది. వాటిలో బ్రెస్ట్, కలోన్, లంగ్, బ్రెయిన్, ఒవేరియన్ కాన్సర్లు ఉన్నాయి. జంతువుల మీదా చేసిన పరిశోధనల్లోనూ, టెస్ట్-ట్యూబ్ స్టడీస్ లోనూ ఈ మూలిక ట్యూమర్ గ్రోత్ ని అరికట్టగలదని తెలిసింది.

6. బ్రెయిన్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది

ఈ ఆయుర్వేద మూలిక బ్రెయిన్ ఫంక్షన్ ని పెంచడమే కాక జ్ఞాపకశక్తి ని అభివృద్ధి చేసి పనితీరుని మెరుగుపరుస్తుందని పరిశోధనలు చెబున్నాయి.