Begin typing your search above and press return to search.

గాంధీ మొదలు వాజ్ పేయ్ వరకూ వదల్లే

By:  Tupaki Desk   |   2 Sep 2016 5:05 PM GMT
గాంధీ మొదలు వాజ్ పేయ్ వరకూ వదల్లే
X
మొండోడు రాజు కంటే బలవంతుడని ఊరికే అనలేదేమో? తమ పార్టీ నేత చేసిన వెధవ పనిని వెనకేసుకొచ్చేందుకు ఊహాగానాలు.. పిచ్చాపాటిగా చెప్పే మాటల్ని.. మహానేతలు చేసిన వ్యాఖ్యల్ని తనదైన శైలిలో వక్రీకరిస్తూ.. సంచలనంతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సందీప్ కుమార్ ఇద్దరు మహిళలతో కలిసి ఉన్న అభ్యంతరకర సీడీ బయటకు రావటం.. దీనిపై స్పందించిన ఆ పార్టీ అధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సందీప్ ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇదిలా ఉంటే.. తాజాగా వెల్లువెత్తుతున్న విమర్శల మీద రియాక్ట్ అయిన పార్టీ అధికారప్రతినిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటం గమనార్హం.

శృంగారం మానవ లక్షణం అంటూ తమ పార్టీ నేత చేసిన వెధవ పనిని సమర్థించే ప్రయత్నంలో.. పలువురు మహానేతలపై తీవ్ర ఆరోపణలు చేయటం అభ్యంతరకరమని చెప్పకతప్పదు. ఒకరు చేసిన తప్పు సరైందని చెప్పేందుకు ఊహాగానాలు.. గతంలో చాలామంది నోటి నుంచి వినిపించిందంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయటాన్ని ఖండించాల్సిందే. ఇంతకీ అశుతోష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే..

= దేశంలో పెద్ద పెద్ద నాయకులు కూడా సామాజిక బాధ్యతలు మరిచి ప్రవర్తించారు.

= మహాత్మా గాంధీ.. జవహర్ లాల్ నెహ్రూ.. వాజ్ పేయ్ లు ఇతర మహిళలత సంబంధాలు పెట్టుకున్న వార్తలు వచ్చాయి. వారు మాత్రం రాజకీయంగా నష్టపోలేదు.

= నెహ్రూ తనతో పని చేసే మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారనే పుకార్లు షికార్లు చేశాయి. ఎడ్వినా మౌంట్ బాటెన్ తో నెహ్రూకున్న అనుబంధం గురించి అప్పట్లో విపరీతమైన చర్చ జరిగేది.

= 1910లో గాంధీ సర్లా చౌదరితో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ కు దూరపు బంధువు. సర్లా తన ఆత్మకు భార్య అని గాంధీ స్వయంగా చెప్పారు. గాంధీ వ్యవహారాన్ని పార్టీ సీనియర్ నేతలు కలుగజేసుకొని ఆమెను వదిలివేసేలా చేశారు. తర్వాతి రోజుల్లో తన బ్రహ్మచర్యన్ని పరీక్షించుకునేందుకు యువతులతో కలిసి నిద్రించిన విషయాన్ని గాంధీజీ వెల్లడించారు.

= అటల్ బీహారీ వాజ్ పేయ్ సంఘ్ సంప్రదాయాల్ని పాటిస్తూ వివాహం చేసుకోలేదు. పార్లమెంటులో తాను బ్యాచిలర్ నే కానీ బ్రహ్మచారిని కాదని చెప్పటం మర్చిపోకూడదు.

= వాజ్ పేయ్ బహిరంగంగా కాలేజీ స్నేహితురాలితో కలిసి తిరిగారు. అప్పుడెవరూ ఆయనకు అడ్డు చెప్పలేదు. సోషలిస్ట్ లీడర్ మనోహర్ లోహియా.. జార్జ్ ఫెర్నాండెస్.. చైనా దార్శిక నేత మావోకు కూడా మహిళలతో సంబంధాలున్న విషయాన్ని మర్చిపోకూడదు.