Begin typing your search above and press return to search.

రాజుగారు కనిపించడం లేదు..!

By:  Tupaki Desk   |   22 Sept 2019 10:17 AM IST
రాజుగారు కనిపించడం లేదు..!
X
విజయనగరం రాజుల వారసుడైన అశోక్ గజపతి రాజు ఎన్నికల ఫలితాల అనంతరం కనిపించడం లేదు.. టీడీపీ తరుఫున విజయనగరం ఎంపీగా పోటీచేసిన ఆయన ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమైపోయారు. ఇప్పుడు యాక్టివ్ గా లేరు. ఎప్పుడూ విజయనగరంలోని కోటలో ఉండే ఆయన 100 రోజులుగా జిల్లాలోనే లేరు. ఎటు వెళ్లారు? ఏం చేస్తున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

విజయనగరం టీడీపీకి కంచుకోట.. అక్కడ వరుసగా ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా అశోక్ గజపతి రాజు గెలుస్తూవచ్చారు. 2004 - 2019 లో మాత్రమే ఈ టీడీపీ సీనియర్ నేత ఓడిపోయారు. 1978 నుంచి వరుసగా గెలుస్తున్నారు.

అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అశోక్ గజపతితోపాటు ఆయన కుమార్తె - ఎమ్మెల్యేగా పోటీచేసిన అదితి కూడా ఓడిపోయింది. సొంత టీడీపీ నేతలే తన కుమార్తెను ఓడించారని ఆయనకు ఫిర్యాదులు అందాయట.. ఇక వైసీపీ హోరు కూడా ఈయనను ఎంపీగా ఓడించేందుకు కారణమైందట..

ఎన్నికల వేళ బాగా తిరిగిన అశోక్ గజపతి తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారట.. వెన్నునొప్పితో అరగంట కూడా కూర్చోలేకపోతున్నారట.. ఫిజియోథెరపీతోపాటు చికిత్స కోసమే హైదరాబాద్ లోనే 100 రోజులుగా ఉంటూ విజయనగరం సహా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. విజయనగరంలోని తన భవంతి అందుబాటులో ఉండే అశోక్ గజపతి ఇంత కాలం ఎప్పుడూ జిల్లాకు దూరంగా ఉన్నది లేదట.. ఆయన రాకపోవడానికి అసలు కారణం అనారోగ్యమేనని తేలింది.