Begin typing your search above and press return to search.
అశోక్ గజపతికి అంత అవమానమా?
By: Tupaki Desk | 11 April 2018 6:10 AM GMTసామాన్యుల సంగతిని వదిలేస్తే.. ప్రముఖుల విషయంలోనూ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అనుసరిస్తున్న వైనం షాకింగ్ గా ఉంటోంది. అది కూడా నిన్న మొన్నటి వరకూ పౌరవిమానయాన శాఖకు మంత్రిగా వ్యవహరించిన అశోక్ గజపతి రాజు విషయంలో ఎయిరిండియా అనుసరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. మొన్నటి వరకూ తమకు బాస్ గా వ్యవహరించిన అశోక్ గజపతి విషయంలో ఎయిరిండియా దారుణంగా వ్యవహరించటమేకాదు.. ఆయన్నుఅవమానించారన్న విమర్శలు ఎదుర్కొంటోంది.
అలసత్వంతో వ్యవహరించిన ఎయిరిండియా తీరు తెలిసిన వారంతా మండిపడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం భార్య.. కూతురు.. సోదరితో అశోక్ గజపతిరాజు ఎయిరిండియా 451 విమానంలో ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు. తన ప్రయాణంలో భాగంగా 9 బ్యాగుల్ని లగేజీలో బుక్ చేశారు.
ఇందులో ఒక బ్యాగ్ కనిపించలేదు. ఈ విషయాన్ని ఎయిరిండియా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. జరిగిన తప్పును గుర్తించిన ఎయిరిండియా సిబ్బంది అశోక్ గజపతికి క్షమాపణలు చెప్పి.. బుధవారం పంపుతామని హామీ ఇచ్చారు. పౌర విమానయాన శాఖకు మంత్రిగా వ్యవహరించిన నేత లగేజీ విషయంలో అంత నిర్లక్ష్యమా? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. నిర్లక్ష్యానికి కేంద్రమంత్రి అయితే ఏమిటి? మామూలోళ్లు అయితే ఏమిటి?