Begin typing your search above and press return to search.

రాజుగారి ధూమపానం

By:  Tupaki Desk   |   7 April 2015 10:44 PM IST
రాజుగారి ధూమపానం
X
పొగతాగడంపై దేశవ్యాప్తంగా రచ్చ సాగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దుమపానాన్ని నిషేధించాలని కృతనిశ్చయంతో ఉంటే బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు అందుకు అనుకూలంగా మాట్లాడి రభస చేస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. అయితే మీకు తోడుగా నేనున్నా బీజేపీ మిత్రపక్షమైన టీడీపీకి చెందిన కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

''నేను చైన్‌ స్మోకర్‌ ని కాబట్టి అగ్గిపెట్ట లేదా లైటరు ఎప్పుడూ నా వెంటే ఉంటుంది. విమానం ఎక్కేటప్పుడు కూడా! గతంలో కేంద్రమంత్రి కాకముందు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన సమయంలో వెంట మ్యాచ్‌బాక్స్‌, లైటర్‌ను తీసుకెళ్తే భద్రతా అధికారులు చెక్‌ చేసి వాటిని లాక్కున్నారు. కానీ నేను కేంద్రమంత్రి ని అయ్యాక అధికారులు ఇప్పుడు ఎలాంటి చెకింగ్‌ ను చేయలేటం లేదు'' అని అన్నారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మ్యాచ్‌ బాక్స్‌లను ఎయిర్‌పోర్ట్‌లోకి తీసుకురావటం భారత్‌లో నిషేధం కదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆ విషయం తనకు తెలియదని అన్నారు. తన వద్ద ఇప్పుడు కూడా సిగరెట్లు ఉన్నాయంటూ సమాధానమిచ్చారు.

పొగతాగే అలవాటు ఉన్న విమాన ప్రయాణికులు ఇక నుంచి తమ వెంట మ్యాచ్‌బాక్స్‌ను వెంట పెట్టుకెళ్లవచ్చని అశోక్‌గజపతి రాజు అన్నారు. అయినా.. అగ్గిపెట్టెతో ఎవరైనా ఫ్లైట్‌ ని హైజాక్‌ చెయ్యొచ్చా! ప్రపంచంలో అలాంటి సంఘట ఎప్పుడైనా జరిగిందా? అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కామెంట్లకు అవాక్కయిన విలేకరులు.. ''విమానయాన మంత్రి అయిఉండీ ఇలా మాట్లాడటం సబబేనా?'' అని ప్రశ్నించగా, నేనన్నదాంట్లో తప్పేముంది? అని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు.