Begin typing your search above and press return to search.

బంగాల్ దంగల్: భాజపా అభ్యర్థిపై దాడి.. అనుమానం వారిపైనే?

By:  Tupaki Desk   |   31 March 2021 4:03 AM GMT
బంగాల్ దంగల్: భాజపా అభ్యర్థిపై దాడి.. అనుమానం వారిపైనే?
X
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైనా తృణమూల్ కాంగ్రెస్, భాజపాలు పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల బరిలో ఉన్న అభ్యర్థులపై దాడులు జరుగుతుండడం గమనార్హం. పశ్చిమ బెంగాల్లోని మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కారుపై దాడి జరిగింది.

'టీఎంసీ దాడులే'
మొయినా జిల్లాలో ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల గుంపు తన కారుపై రాళ్లు రువ్వారని ఆయన చెప్పారు. సుమారు 50 మంది ఈ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అశోక్ దిండా తీవ్రంగా గాయపడినట్లు భాజపా నేతలు చెబుతున్నారు. ఓడిపోతామనే భావంతోనే తమ అభ్యర్థిపై దాడులకు దిగారని ఆరోపిస్తున్నారు.

పోటాపోటీ
ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అధికార, ప్రతిపక్ష వర్గాల నడుమ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఇరు వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి. నందిగ్రామ్ నియోజక వర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి సీఎం మమతా బెనర్జీ, భాజపా నుంచి సువేందు అధికారి బరిలో ఉన్నారు. కాగా ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మరాయి.

సవాళ్లు
సువేందు అధికారి, మమత బెనర్జీ గతంలో మిత్రులు కాగా.. ఇప్పుడు పోటాపోటీగా తలపడనున్నారు. గతేడాది డిసెంబర్లోనే సువేందు అధికారి భాజపాలో చేరడం.. అనూహ్యంగా నందిగ్రామ్ నుంచి తలపడనున్నట్లు ప్రకటించడం గమనార్హం. కాగా మమత అదే స్థానం నుంచి పోటీచేస్తానని సవాలు విసరడం విశేషం. మరి ఈ పోరులో అంతిమ విజయం ఎవరిదో చూడాలి.