Begin typing your search above and press return to search.
అశోక్ బాబు పంతమా...చంద్రబాబు మంత్రమా?
By: Tupaki Desk | 6 Jun 2016 6:39 AM GMTకొత్త రాజధాని అమరావతిలో ఏపీ తాత్కాలిక సచివాలయం దాదాపుగా సిద్ధమైపోయింది... మరో 20 రోజుల్లో నవ్యాంధ్ర పాలన అక్కడి నుంచే మొదలవుతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఈ నెల 27 నుంచి నవ్యాంధ్ర పరిపాలన అమరావతి నుంచే జరిగి తీరుతుందని చంద్రబాబు ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో అప్పటిలోగా ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే... ఇప్పటివరకు అమరావతికి ఉద్యోగుల తరలింపు విషయంలో చంద్రబాబుతో బాగానే ఉన్న ఏపీ ఎన్జీవోల నేత అశోక్ బాబు సడెగ్ గా అడ్డం తిరిగారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కొత్త రాజధానికి ఎలా వస్తామంటూ ఆయన చేసిన ప్రకటన చంద్రబాబును ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. వసతులన్నీ కల్పించిన తర్వాతే తాము అమరావతికి వస్తామంటూ ఆయన కుండబద్ధలు కొట్టి చెబుతున్నారు. దీంతో 27 నాటికి ఎలాగైనా అమరావతికి రావాల్సిందేనంటున్న చంద్రబాబు... వసతులు లేకుంటే వచ్చేది లేదంటున్న అశోక్ బాబు పట్టుదలల మధ్య ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.
ఉద్యోగుల తరలింపు విషయంలో ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ నెల 27 నాటికి తాత్కాలిక సచివాలయం పూర్తవుతుందన్న నమ్మకం తమకు లేదని.. సీఎం చంద్రబాబు సహా మంత్రులు చేస్తున్న ప్రకటనలు నమ్మశక్యంగా లేవని అశోక్ బాబు అన్నారు. అయినా వసతులు లేకుండా అమరావతికి వచ్చి తామేం చేస్తామని ఆయన వాదిస్తున్నారు. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ప్రభుత్వానికి స్పష్టతే లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తాత్కాలిక సచివాలయంలో తమకు అవసరమైన అన్ని మైలిక వసతులు ఏర్పాటైన తర్వాతే తాము హైదరాబాదు నుంచి తరలివస్తామని ఆయన చెప్పేశారు.
అదే సమయంలో అశోక్ బాబు వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. ఈ నెల 27లోగా ఉద్యోగులంతా అమరావతికి తరలిరావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అశోక్ బాబు వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహిస్తూ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. దీంతో చంద్రబాబు వార్నింగులకు ఉద్యోగులు దిగొస్తారా లేదంటే ఉద్యోగుల డిమాండ్లకు చంద్రబాబే దిగొస్తారా చూడాలి. అశోక్ బాబు పంతం నెగ్గుతుందో.. చంద్రబాబు మంత్రం పనిచేస్తుందో 27వ తేదీ వస్తే కానీ తెలియదు.