Begin typing your search above and press return to search.

జేసీ వార‌సుడు డమ్మీనేనా?

By:  Tupaki Desk   |   1 March 2017 6:28 AM GMT
జేసీ వార‌సుడు డమ్మీనేనా?
X
ఏపీ శాస‌న‌మండలి ఎన్నిక‌ల్లో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ కూడా ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీగా మార‌నున్నారు. లోకేశ్ తెరంగేట్రం చేస్తున్న ఎన్నిక‌ల్లోనే ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబందించి నిన్న‌టితో నామినేష‌న్ల గ‌డువు ముగిసింది. ఆయా స్థానాల‌కు టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌గా... ఆయా ప్రాంతాల్లోని నామినేష‌న్ల‌ను ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్థానానికి టీడీపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు నామినేష‌న్ వేశారు. అయితే టీడీపీ టికెట్‌ను ఆశించి భంగ‌ప‌డ్డ ఆ పార్టీ నేత, కంచిలి స‌హ‌కాయ సంఘం అధ్య‌క్షుడు త‌మ‌రాల శోభ‌న్ బాబు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశారు. శోభ‌న్ బాబు టీడీపీ రెబెల్ గానే బ‌రిలోకి దిగిన‌ట్లు జిల్లాలో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

ఇక ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు చెందిన మూడు స్థానాలకు కూడా టీడీపీ అభ్య‌ర్థుల‌తో పాటు ఆ పార్టీ నుంచి రెబెల్స్ బ‌రిలోకి దిగారు. పేరుకు స్వ‌తంత్ర అభ్య‌ర్థులేన‌ని చెబుతున్నా... టీడీపీ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ఆ పార్టీ నేత‌లే బ‌రిలోకి దిగిన‌ట్లు స‌మాచారం. ఇక అనంత‌పురం జిల్లా విష‌యానికి వ‌స్తే... టీడీపీ అధికారికంగా ప్ర‌క‌టించిన దీప‌క్ రెడ్డి నామినేష‌న్ వేయ‌గా... టీడీపీకే చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయ వాస‌రుడిగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన అస్మిత్ రెడ్డి కూడా నామినేష‌న్ వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస్మిత్ రెడ్డిని త‌న వార‌సుడిగా రాజ‌కీయ తెరంగేట్రం చేయించాల‌ని తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యూహాలు ర‌చిస్తున్నారు. అదే స‌మంలో అనంత‌పురం ఎంపీగా ఉన్న ఆయ‌న సోద‌రుడు జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా త‌న త‌న‌యుడు జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డిని రాజ‌కీయాల్లోకి దింపాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలో నిన్న దీప‌క్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డి కూడా ఆ జిల్లా స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లో నామినేష‌న్ వేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. సాధార‌ణంగా ఆయా పార్టీలు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థి నామినేష‌న్ల ప‌రిశీల‌న సంద‌ర్భంగా అన‌ర్హుడ‌ని తేలితే... పార్టీ పోటీలో లేకుండా వెళ్లిపోతుంద‌న్న భ‌యంతో డ‌మ్మీ నామినేష‌న్లు వేయిస్తున్న విష‌యం మ‌న‌కు తెలిల‌సిందే. ఈ డమ్మీ నామినేష‌న్లు ఆయా ప్ర‌ధాన అభ్య‌ర్థుల అనుచ‌రులో, కింది స్థాయి కేడ‌ర్ నేత‌ల‌తోనో వేయిస్తారు. అయితే దీపక్ రెడ్డి నామినేష‌న్‌తో పాటు అస్మిత్ రెడ్డి నామినేష‌న్ వేయ‌డంతో... అస్మిత్ రెడ్డి డ‌మ్మీ నామినేష‌న్ వేశార‌ని అక్క‌డి టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/