Begin typing your search above and press return to search.

ఆశారం బాపు అల్లరిపనులు మానలేదు!!

By:  Tupaki Desk   |   26 Sept 2016 10:19 AM IST
ఆశారం బాపు అల్లరిపనులు మానలేదు!!
X
చాలా మంది వారికున్న వయసుకి, చేసే చేష్టలకి ఏమాత్రం పొంతనుండకుండా బ్రతికేస్తుంటారు. చేసే పని తనకు గౌరవం తీసుకొస్తుందా, లేక అభాసుపాలు చేస్తుందా అనే విషయం కూడా ఆలోచించే ఇంగితం కోల్పోతుంటారు. అది వయసు మీద పడుతుండటం వల్ల మెదడుకు సంబందించిన కొన్ని పనులు మొద్దుబారిపోవడమో లేక అలవాటులో పొరపాటుగా పలికే మాటలో కానీ వృద్దాప్యంలో కూడా అల్లరి యువకుల్లా ప్రవర్తిస్తూ చిల్లర వేషాలు వేస్తుంటారు! కాసేపు ఆ సంగతులు పక్కనపెడితే... తాజాగా, ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు ఒక నర్సుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు!

ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో వైద్యపరీక్షలు నిర్వహించాలని, అనంతరం ఆయన ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో... ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును పోలీసులు ఢిల్లీ ఎయిమ్స్‌ కి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో ఎయిమ్స్‌ లోని నర్సుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు! వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌ కు వచ్చిన ఆయన అక్కడి నర్సుపై... "నువ్వు వెన్నలా ఉన్నావు.. నీ బుగ్గలు కశ్మీర్‌ యాపిల్స్ లా ఉన్నాయి" అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

అక్కడికే అసహ్యం అనిపించడం మొదలుపెట్టినా... వాటిని ఇంకా కొనసాగిస్తూ, తాను యువకుడిగా మారేలా చికిత్స చేయాలని అక్కడి వైద్యులను కోరారు. కాగా సుప్రీం ఆదేశాల మేరకు ఎయిమ్స్‌ లో వైద్యపరీక్షలకు హాజరైన ఆశారాం... పోలీసుల సాయంతో వీల్ చైర్ లో ఆస్పత్రికి వచ్చారు.. ఆ పరిస్థితుల్లో చేసిన వ్యాఖ్యలే ఇవి!!